23, మార్చి 2016, బుధవారం

గ్రిష్నేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోరా



                                మహారాష్ట,  ఔరంగాబాద్ కు 35 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ది చెందిన ఎల్లోరా గుహల మీదుగా వెరుల్ గ్రామం చేరవచ్చు ఇక్కడే శ్రీ ఆది శంకరా చార్యులు ప్రవచించిన 12 జ్యోతిర్లింగాల చివరిది గ్రిష్నేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది. అతి పురాతనమైన ఈ దేవాలయాన్ని 18 శతాబ్దం లో ఇండోర్ పాలకురాలు రాణి అహల్య బాయి హోల్కర్ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసింది. ఇది ఎర్ర రాతి చేత నిర్మించబడిన ఆలయం. స్థల పురాణాల ప్రకారం  తన భక్తురాలైన గ్రిష్మ కు ఇచ్చిన వరం కారణంగా ఇక్కడ శివుడు స్వంభువుగా ఆవిర్భవించాడు, అందుచేత ఇక్కడ పరమ శివుణ్ణి గ్రిష్నేశ్వరుడు అని పిలుస్తారు. ఆలయ దర్శనానికి వచ్చే యాత్రికులు సాంప్రదాయ వస్త్రాలే (పురుషులైతే షర్ట్ లేకుండా ) ధరించాలి.
       

               ఈ ఆలయానికి దగ్గరలోనే ఛత్రపతి శివాజీ తండ్రి షాహాజి భోంస్లే సమాది మందిరం ఉన్నది. ఔరంగాబాద్ కు18 కిలోమీటర్ల దూరంలో . . . . . . . . . దౌలతా బాద్, దేవగిరి (లేదా)దౌలతాబాద్ కోట ఉన్నది, అక్కడ నుండి 15 కిలోమీటర్ల దూరంలో . . . . . . . . .  ఎల్లోరా గుహాలు ఉన్నాయి. ఇక్కడ నుండి 2 కిలో మీటర్లు ప్రయాణించి . . . . . . . . .   వెరుల్ గ్రామానికి గ్రామం చేరుకోవచ్చు. ఔరంగాబాద్ లో రైల్వే స్టేషన్ ఉన్నది, ఎయిర్ పోర్ట్ కూడా ఉన్నది. వెరుల్ నుండి నాసిక్ వెళ్ళే మార్గంలోనే 100 కిలోమీటర్ల దూరం లోనే షిర్డీ క్షేత్రం ఉన్నది .   

22, మార్చి 2016, మంగళవారం

భీమ శంకర జ్యోతిర్లింగం ,మహారాష్ట్ర

భీమ శంకర జ్యోతిర్లింగం, భీమ శంకర్


భీమ శంకర క్షేత్రం

                                  భీమ శంకర్ క్షేత్రం మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత పంక్తుల్లో ఉన్నది .పౌరాణిక కాలం లో ఇక్కడ  పరమ శివుడు భీమాసురుణ్ణి వధించి (యుద్ద సమయం లో శివుడి స్వేద బిందువుల నుండి భీమానది పుట్టిందని ఇక్కడి వారి విశ్వాసం, ఇది కృష్ణా నదిలో కలుస్తుంది  )  దేవతల కోరిక పై భీమ శంకరుడు గా   అవతరించాడు. ఆలయానికి 6-7 కిలోమీటర్ల దూరంలో గుప్త భీమ శంకర లింగం ఉన్నది.  ఆలయ చరితలో చివరగా మహారాష్ట్ర పాలకుడు నానా పడ్నవీశ్ ఈ ఆలయానికి మెరుగులు దిద్దాడు.

Bhimashankar Jyotirlingam 
                                    ముంబై నుండి లోనావాల మీదుగా 200 కిలోమీటర్ల దూరం లో ఉన్నది. పశ్చిమ , ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చే వారికి  నాసిక్  రోడ్ నుండి 210 కిలో మీటర్లు, హైదరాబాద్  ఇంకా  దక్షినాది రాష్ట్రాల నుండి వచ్చే యాత్రికులకు  ఈ సహ్యాది  కొండల్లో ప్రయాణానికి మాత్రం 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న  పూనే  మొదటి మజిలి అవుతుంది. పూనే నుండి రాజ్ గురు నగర్ (ప్రముఖ స్వాతంత్ర్య సమర  యోదుడు , భగత్ సింగ్ తో పాటు ఉరికంబ మెక్కిన  "రాజ్ గురు "  స్వ గ్రామం) గ్రామం  మీదుగా ఈ పుణ్య క్షేత్రం చేరు కోవచ్చు.

ముంబై - భీమ శంకర్  రోడ్ మార్గం 

                                          భీమ శంకర్ పుణ్య క్షేత్రం  కు వచ్చే  యాత్రికుల నిమిత్తం  భీమాశంకర్ లోను పరిసర ప్రాంతాలలోను  అక్కడక్కడ  వసతి సౌకర్యాలు ఉన్నాయి .  కానీ  భీమశంకర ఆలయం, అక్కడి అందమైన కొండలు (చిన్న పాటి ట్రెకింగ్ ) దర్శించడం  అంతా  ఒక్క  day timeలో ముగిసే యాత్ర కాబట్టి పూనే నుండే వెళ్ళే వారు  food packets  వగైరాలతో వెళ్ళటం ఉత్తమం.చత్రపతి శివాజీ జన్మించిన కోట శివనేరి ఇక్కడకు 70 కిలోమీటర్ల దూరం  లో ఉన్నది.

20, మార్చి 2016, ఆదివారం

హిమాలయాల్లో జ్యోతిర్లింగం

కేదారేశ్వర జ్యోతిర్లింగం, కేదారనాథ్, ఉత్తరాఖండ్ 

కేదార్ నాథ్  దేవాలయం 
                               ఈ కేదారే శ్వర జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్  రాష్ట్రం  నందు హిమాలయాల్లో ఉన్నది ఈ ఆలయం సంవత్సరం లో 6 మాసాలు మంచులో కప్పబడి మూసి వేయబడి ఉంటుంది (కార్తిక పౌర్ణమి నుండి షుమారుగా  మే నెల వరకు ) ఆలయాన్ని మూసివేసే సమయం లో  ఆలయం లో దీపం వెలిగిస్తారు  మరల గుడిని తెరిచే వరకు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది  దీప దర్శనం శివుని ఆశీర్వచనంగా భక్తులు భావిస్తారు. పాండవులు ఇక్కడ మహా శివుణ్ణి సేవించినట్లు స్థలపురాణాలు తెలుపుతున్నాయి .

హరిద్వార్
          యాత్ర అంతా హరిద్వార్ నుండి, అక్కడ పారే గంగా నది, దాని ఉపనదుల  తీరాల వెంబడి, రమ్యమైన హిమాలయ పర్వత శ్రేణుల మద్య సాగుతుంది,హరిద్వార్కు 20 కిలో మీటర్ల దూరంలో ఋషికేశ్ ప్రముఖ పుణ్యక్షేత్రం ఇక్కడ వరకు కుడా  రైళ్ళు నడుస్తుంటాయి.


గంగ -అలకనంద నది సంగమం -ఋషికేశ్  
       
           ఇక్కడ(ఋషికేశ్)నుండి 75కిలో మీటర్ల దూరం లో దేవ ప్రయాగ క్షేత్రం ఉన్నది . ఇక్కడ గంగ నదితో అలక్ నంద నది సంగమిస్తుంది .                                                  
మందాకినీ -అలకనంద నదుల సంగమ ప్రాంతం -రుద్రప్రయాగ 
                                                 ఇక్కడ నుండి  70కిలోమీటర్ల దూరం అలకనంద నది తీరం వెంబడి 
ప్రయాణించిన  తరువాత  రుద్ర ప్రయాగ క్షేత్రం వస్తుంది  ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం వలన పాపాపంక్తిలమైన పాండవులకు శివుడు దర్శన మివ్వకపోవటం చేత  క్షేత్రాన్ని గుప్త కాశి అని పిలుస్తారు ఇక్కడ  అలకనంద నదిలో మందాకినీ నది కలుస్తుంది.
                                           ఇక్కడ నుండి మందాకినీ నది తీరం వెంబడి 72 కిలోమిత్రాల ప్రయాణం
 తరువాత గౌరికుండ్ క్షేత్రం వస్తుంది .ఇక్కడ వేడినీటి బుగ్గలు /ఉష్ణ కుండాలు ఉన్నాయి .పార్వతి దేవికి మరో పేరు గౌరీ, గౌరీకుండ్ క్షేత్రంలోనే శివుడికై పార్వతి తపమాచరించిన ప్రదేశం ఇదే, వేడి నీటి కుండాలలో పార్వతీదేవి స్నాన సమయంలో నలుగు పిండితో గణేసుణ్ణి  చేసింది ఇక్కడే.
గౌరికుండ్  చేరిన తరువాత  అక్కడ నుండి 14 కిలోమీటర్ల దూరం కాలినడకన , డోలీ  మీద లేదా గుఱ్ఱాల మీద కేదార్ నాథ్ కు చేరవలసి  ఉంటుంది. 


కేదారేశ్వర జ్యోతిర్లింగం: courtesy : news. maffat. com 

                  ఇక్కడ ప్రతి కూడలి లోను అన్ని స్థాయిల్లో మెరుగైన వసతులిచ్చే హోటల్లు ,రెస్ట్ హౌస్లు" ఉన్నాయి హరిద్వార్ కు దేశం లోని అన్ని ప్రాంతాలనుండి రైళ్ళు నడుస్తున్నాయి ,డిల్లి నుండే కాక ఇతర పరిసర ప్రాంత నగరాల నుండి హరిద్వార్ కు  పలు బస్సు సర్వీసులు నడుస్తుంటాయి ఇక్కడ నుండి  గౌరికుండ్ కు (235 కిలోమీటర్లుపరిమితంగా బస్సులు నడుస్తుంటాయి   హరిద్వార్ కు 35 కిలోమీటర్ల దూరంలో డెహ్రడూన్ విమానాశ్రయం ఉన్నది.

19, మార్చి 2016, శనివారం

Jim Corbett park at Himalayas

Jim Corbett National Park, Uttarakhand

                                                  జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నైనిటాల్ జిల్లా ఉత్తరాఖండ్ రాష్ట్రములో ఉన్నది.హిమాలయ పర్వత పాదాల వద్ద 1300చదరపు కిలో మీటర్ల  పరిధిలో విస్తరించి ఉన్న అటవీ ప్రాతంలో జిమ్ కార్బెట్  నేషనల్  పార్క్  షుమారు 520  చదరపు  కిలో మీటర్లు  లలో  ఉన్నది. కొండలు గుట్టలు చిత్తడి మైదానాలు , సెల యేళ్ళుతో కూడిన ఈ పెద్ద పులుల అభయారణ్యం జిపుల మీద ,బస్సులమిద  విహరించవచ్చు  ఏనుగుల మీద సవారికి కుడా అకాశం ఉన్నది.


               రాత్రి వేళల్లో కూడా  బసచేయటానికి అవకాశం ఉన్నది. ఉత్తేజబరితమైన పూర్తి ఆటవిక వాతావరణాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. చేపల్ని వేటాడ మెసళ్ళు, స్థానికంగా కనిపించే జంగు పిల్లుల మొదలు జాతీయ మృగ మైన పెద్దపులులు,ఏనుగులు,లేళ్ళు మద్య విహరించవచ్చు.


                             నైనిటాల్ జిల్లా లోని రామ్ నగర్ అనే చిన్న పట్నంలో   జిమ్ కార్బెట్ పార్క్ అడ్మినిస్ట్రే టివ్  కార్యాలయం  ఉన్నది .మొత్తం  పార్క్ ను 6 గా జోన్స్ విడగొట్టి  ఆయ ప్రాంతాలనుండి  వాతవరణాన్ని అనుసరించి పార్క్ లోనికి యాత్రికులను అనుమతిస్తుంటారు. పార్క్ వారి అనుమతి పొందిన వ్యాన్లు,జీపులు ఉంటాయి వాటిద్వారానే యాత్రికులను లోపలకు పంపుతారు . కాలినడకకు , ప్రవేటు వాహనాలకు అనుమతి ఉండదు . ఆయ ప్రాంతాలలో స్టార్ హోటళ్ళు , రిసార్ట్స్ చాల ఉన్నాయి.

Zone     Dhikala     Jhirna     Durga devi   DhelaBijrani Sonanadi
Entry Gate   Dhabgashi      Dhela      Durga deviDhela       Amdanda            Vatanvasa


రామ్ నగర్ దగ్గరలోని దర్శనీయ ప్రదేశాలు:-
గార్జియా ఆలయం:
స్థానికం గా పేరుపొందిన  పార్వతి దేవి ఆలయం ,గిరిజ దేవి అని కూడా పిలుస్తారు . రాంనగర్ కు 16 కిలోమీటర్ల దూరం లో ఉన్నది 

రాణిఖేట్:
రాంనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిల్ స్టేషన్ ఇది .నైనిటాల్ ఇక్కడకు 65 కిలోమీటర్ల దూరం లో ఉన్నది.  

200 కిలోమీటర్ల దూరంలో హరిద్వార్ ,హృషికేశ్ పుణ్య క్షేత్రాలున్నాయి.

290 కిలోమీటర్ల దూరంలోని డిల్లీ నగరం నుండి మొరదాబాద్  జంక్షన్ మీదుగా ఇక్కడకు రైళ్ళు నడుస్తున్నాయి.

170 కిలోమీటర్ల దూరం లోని బరేలీ జంక్షన్(ఉత్తర ప్రదేశ్) నుండి కూడా రైళ్ళు నడుస్తుంటాయి. 
మన రాజధాని డిల్లి , ఇంకా మొరదా బాడ్ , బరేలి, హాల్ద్వాని ల నుండి బస్సులు నడుస్తుంటాయి. 

50 కిలోమీటర్ల దూరం లో Pantnagar  డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ ఉన్నది.

అవి ఇవి అన్ని

మా అమ్మకేం తెలియదు

సాయంత్రం కంప్యూటర్ క్లాస్ నుండి ఇంటికి రాగానే పుస్తకాల్ని షెల్ఫ్ లోకి నెట్టేసి , సోఫాలో కూర్చుని చకచకా టివీ చానల్స్ మారుస్తున్నా  నా ఆత్రుత అంతా జరుగుతున్నా  ఇండియా -ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ పైనే
"అరేయ్ హర్షా "  కిచెన్ లోంచి అమ్మ పిలుపు, విసుగ్గానే లేచాను
"మార్కెట్ కెళ్ళి కూరగాయలు తీసుకు రారా " చెమటలు పట్టిన ముఖాన్ని పైట కొంగు తో తుడుచుకుంటూ చెప్పింది అమ్మ,   తల ఉపేను నేను , గ్రైండర్ పై  పిండి రుబ్బుతూ ,పక్కనున్న చేతి సంచి ఇవ్వబోయింది
" ఆ పనికి మాలిన  సంచి ఎందుకు "
"దాన్ని అవతల పడేయ్" చిరాకు పడ్డా అమ్మ మీద   ఆ కాకి రంగు సంచి అంటే నాకు పరమ చిరాకు
మా నాన్న గారు కూడా అప్పుడప్పుడూ  అ సంచినే మార్కెట్ కు తీసుకు వెళతారు
ఎక్కడ ఏమి కొన్నా క్యారీ బ్యాగ్గుల్లో  ఇస్తున్నారు చక్కగా సౌకర్యం ఉంటాయి ,
పర్యావరణం ,పర్యావరణం అంటారు గాని , ఎవరు క్యారి బ్యాగ్గులు వాడటం మానేస్తున్నారు
 నేనొక్కడిని మానేస్తే కాలుష్యం పోతుందా  పిచ్చిగానీ !
అమ్మ ఇచ్చిన డబ్బులు తీసుకుని మార్కెట్ కు బయలు దేరాను .
నా బండి జోరు గా పోతుంది రోడ్డు మీద ,
 మా అమ్మా వాళ్ళది పల్లెటూరు పెద్దగా చదువుకోలేదు , ఒక్క వంట విషయం తప్పించి ,ఏ విషయం పట్టించుకోదు,సింపుల్ గా ఉండే సెల్ ఫోన్ వాడాలంటే తల్లకిందులై పోతుంది  కూల్ డ్రింక్స్ అంటే ముఖం చిట్లిస్తుంది,ఎక్కడో మార్కెట్లో చూసిందట మలమల మాడే ఎండల్లో వాటిని పడేసి ఉండటం , వాటినే చక్కగా ప్రిజ్  లలో పెట్టి ఇస్తున్నారని
ఆరోగ్య పరమైన విషయాల్లో  మా అమ్మకు శ్రద్ద ఎక్కువే........... ఆ విషయం లో నేను అంతే
ఈ మద్యన రైతులు  ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారని చెప్పి (తెలుగు లో సేంద్రీయ వ్యవసాయం)  కూరగాయల దుకాణాల వాళ్ళు  ప్రత్యేకం కొన్ని కూర గాయల్ని బాగా ఎక్కువ ధర కు అమ్ముతున్నారు
 మా కాలేజిలో లతా లెక్చరర్ ,పక్కింటి జడ్జి గారి అంటి,నా ప్రెండ్ గోపాలరెడ్డి వాళ్ళింట్లో
అందరు ఆర్గానిక్ కూర గాయలనే కొంటున్నారు
ఎరువులు పురుగు మందులు వాడారట , ప్రకృతి సిద్దమైన ఎరువులనే వాడతారట
నేను ఈ మద్యన వాటినే కొంటున్నాను , మొదట్లో మా అమ్మ ఆ రేట్లు చూసి నోరు వెళ్ళ బెట్టింది
ఎరువులు వెయ్యరు , పురుగుల మందులు చల్లరు  సరే
నీళ్ళు కూడా  స్వచ్చమైనవేనా అంటూ కస్సుబుస్సు లాడేది  అమ్మ
 ఇంకానయం గాలికూడా స్వచ్చమైనదేనా అనలేదు
మా అమ్మ కు జనరల్ నాలెడ్జి లేదు మరి చాదస్తం ఎక్కువ
నా బండి సరాసరి వెళ్లి నేనెప్పుడు కూరగాయలు కొనే షాపు దగ్గరే ఆగింది .

-సంజయ్ శ్రీ హర్ష 


జంభుకేశ్వరం జలలింగం

జంభుకేశ్వర,అఖిలాండేశ్వరి దేవ స్థానం,

 తిరువనైకావల్ ,శ్రీరంగం . 


                        పంచ భూతలింగాలలో ఒకటైన జలలింగం శ్రీరంగక్షేత్రం ఉన్న కావేరి నది ద్వీపం లోనే  జంభుకేశ్వర క్షేత్రం లో ఉన్నది.  ఈ క్షేత్రాన్ని స్థానికం గా తిరువనై కోయిల్ గా పిలుస్తారు . పరమ శివుడి ఆగ్రహానికి గురియైన పార్వతీదేవి యోగినిగా మారి జంబు వృక్షం క్రింద  అప్పు (నీరు) లింగాన్ని ప్రతిష్టించి  తపమాచరించగా   శివుడు సంతసించి ఆమెకు  శివ జ్ఞానాన్నిభోదించాడని స్థల పురాణం. ఇక్కడ పార్వతీదేవి శివుడికి పూజాదికాలు నిర్వహించిందని, అందుకు చిహ్నం గా ప్రతిరోజూ నిర్ణిత సమయంలో పూజారి చీర ధరించి పూజలు నిర్వహిస్తారు. పార్వతీదేవి అఖిలాండేశ్వరి గాను జంబు వృక్షం క్రింద (ఒకానొక యోగి పుంగవునకు పరమేశ్వరుడు ఇచ్చిన వరం నిమిత్తం) వేలియటం చేత శివుడు జంభుకేశ్వరుడు గాను పూజ లందుకుంటున్నారు . శ్రీ కాళహస్తి స్థల పురాణాన్ని పోలిన సాలెపురుగు ,ఏనుగు ల కథ కూడా ఆలయ చారిత్రిక ప్రస్తావనలో కనపడుతుంది . 


                 ఈ క్షేత్రం శ్రీరంగం లోని శ్రీ రంగనాథ స్వామీ  ఆలయానికి అతి సమీపంలోనే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది . తిరుచ్చి గా పిలువబడే తిరుచిరాపల్లి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది . మంచి వసతి సౌకర్యాలున్న ఈ నగరం వాయు,రైలు ,రోడ్డు మార్గాలద్వారా రాష్ట్రంలోని ,ఇంకా దేశం లోని ముఖ్య నగరాలతో కలపబడి ఉన్నది. 

దర్శనం వేళలు ఉదయం 6:00నుండి మధ్యాహ్నం 1200 వరకు , సాయంత్రం 5:00నుండి రాత్రి 9:00 వరకు

17, మార్చి 2016, గురువారం

తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి - కేరళ రాష్ట్రంలో గురువాయూర్

  శ్రీ కృష్ణుని ఆలయం, గురువాయూర్, కేరళ  


                                       తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి వలే గురువాయుర్ కేరళ రాష్ట్రంలో ప్రసిద్ద పుణ్య క్షేత్రం.  అంతే కాక;దేశం లోని ప్రముఖ వైష్ణవ దేవాలయాలలో ఇది ఒకటి . శ్రీ కృష్ణుడు ఇక్కడ కొలువై ఉన్న దైవం .   జిల్లా కేంద్రం త్రిచూర్ కు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నది . మహా భారత కాలం లో అభి మన్యుని మనుమడు జనమే జయుడు కృష్ణుణ్ణి పూజించినది ఇక్కడేదేశం లోని చాల దేవాలయాల్లో ఉన్నట్లే ఇక్కడ ఆలయ ప్రవేశానికి డ్రస్ కోడ్ ఉన్నది . పురుషులు దోవతి (పంచె ) మాత్రమే ధరించాలి. స్త్రీలు మాత్రం దక్షినాది సంప్రదాయమైన చీర లేదా ఉత్తరాది వారి వాలే సల్వార్ కమీజ్ ధరించవచ్చును .


దర్శనం వేళలు తెల్లవారు జామున 3:00 లకు వివిధ పుజదికాలతో ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు మరల సాయంకాలం   4:30 నుండి రాత్రి 9:30 వరకు 
                 రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలనుండి రోడ్ కనెక్టివిటీ బాగా ఉన్నది , గురువాయుర్ కు రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ త్రిచూర్ నుండి మాత్రమే దేశం లోని అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్ట్ విటి  బాగా ఉన్నది .  త్రిచూర్ కు 90 కిలో మీటర్ల దూరం లో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉన్నది.

శ్రీరంగం లో మణవాళ పెరుమాళ్ దేవాలయం

అళగీయ మణవాళ పెరుమాళ్ దేవాలయం,

ఉరయూర్ ,తమిళనాడు   


                                                  108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఇది ఒకటి.ఈ క్షేత్రాన్ని తిరుక్కోళి (మోక్ష మిచ్చె ఆలయం )అని కూడా పిలుస్తారు .అళ గీయ మనవాళ పెరుమాళ్ అనగా మనవాళ యోగి చేత కొలవబడిన సుందరమైన దేవుడని అర్ధం . పురాణాల ప్రకారంఇక్కడ శ్రీ మహావిష్ణువు శ్రీ రంగం లోని శ్రీ రంగ నాదుడే కాని ఇక్కడ చోళ రాజుకు కమలం లో సుందర శిశువు రూపం లో దొరకిన శ్రీ మహా లక్ష్మి ( ఇక్కడకమలవల్లి /వాస లక్ష్మి గా పిలువబడు చున్నది) ని యుక్త వయస్సు వచ్చిన పిమ్మటవివాహమాడిఅళ గీయ మణ వాళ పెరుమాళ్ గా (యోగి మన వాళ న్- పూజించటం /కొలవటంచేత )పిలువబడుచున్నాడు 
                                                   
దర్శనం వేళలు  ఉదయం 5:00 నుండి 12:30 వరకు ,సాయంత్రం 5:00 నుండి 8:30వరకు

                      ఇక్కడకు 65 కిలోమీటర్ల దూరంలో తంజావూరు నందు  యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింప బడిన బృహదీశ్వర ఆలయమూ , ఇంకా,108 వైష్ణవ దివ్య క్షేత్రా లైన ఒకటైన   పుండరికాక్ష పెరుమాళ్  దేవాలయం తిరుచినాపల్లి కి 19 కిలోమీటర్ల దూరంలో తిరువెల్లారై నందూ ,రంగనాథ స్వామి దేవాలయం ఉన్న శ్రీరంగ క్షేత్రం ,  7 కిలోమీటర్ల దూరం లో కావేరి నది ద్వీపం లో ఉన్నది ,ఇదే శ్రీరంగ ద్వీపం లో  పంచ భూత లింగాలలో ఒకటైన( జల లింగం)జంబుకేశ్వరలింగ క్షేత్రం ఉన్నవి  . 

                                   
                                                ఉరయూర్ ఒకపుడు గ్రామం గా ఉన్నప్పటికీ ,ఇప్పుడు విస్తరించిన తిరుచిరా పల్లి (trichy) పట్టణం లో కలసిపోయింది . 


16, మార్చి 2016, బుధవారం

అవి ఇవి అన్నీ

స్పీకర్ పదవికి ప్రజా ప్రతినిధులే కావాలా ?

లోక్ సభ కానీ ,రాష్ట్రాల్లో శాసన సభ లు కానివ్వండి ,పార్టీలో సబార్డినేట్ గా  ఉన్న వాళ్ళు సభాపతులుగా తమ పదవుల్ని నిస్పక్షపాతంగా ఎలా నిర్వహించగలరు?

స్పీకర్ పదవికి జుడీషియల్ అధికారాలున్న ప్రభుత్వాధికారులు సరిపోరా  ?


కాంచిపురంలో లో "ఆది కేశవ పెరుమాళ్"

ఆదికేశవ పెరుమాళ్ దేవాలయం

కాంచి పురం ,తమిళనాడు



                                   పాత కాంచీపురం ,అష్ట భుజం సన్నిది స్ట్రీట్ లో ఈ ఆలయం ఉన్నది ఇక్కడ నారాయణుడు ఆది కేశవుడు గాను లక్ష్మి అలవేలు మంగతాయారు గాను వెలసిఉన్నారు . ఇక్కడఆలయం ప్రాంగణం లో   గజేంద్ర పుష్కరిణి ఉన్నది. శ్రీ మహా విష్ణువు అష్ట భుజాలతో దర్శన మివ్వడం చేత అష్ట భుజ ఆదికేశవు డు గాను ,ఈ క్షేత్రాన్ని అష్ట భుజ క్షేత్రం గాను పిలుస్తారు .శ్రీ మహా విష్ణువు  గజేంద్రునికి మోక్ష మిచ్చిన ప్రదేశం ఇదే .


దర్శనం వేళలు :ఉదయం 6:00నుండి 12:00వరకు. సాయంత్రం 4:00 నుండి 9:00 వరకు

15, మార్చి 2016, మంగళవారం

కేరళ లో లక్ష్మన్న పెరుమాళ్

లక్ష్మన్న పేరుమాళ్  దేవాలయం.   తిరుమోజిక్కులమ్ ,కేరళ 

courtesy:-www.vaikhari.org

                                                        ఇది లక్ష్మణుడి ఆలయం గా పిలువబడున్నప్పటికి   ఇక్కడ విష్ణువు , మహాలక్ష్మి శ్రీ మోజ్జికలతప్పన్  ,మధురవేణి తాయార్  గా కొలువై ఉన్నారు .   ఈ ఆలయం కేరళలోని ఎర్నాకులం కు  30 కిలోమీటర్ల దూరంలో చలకుడి నది తీరం లో  ఉన్నది  ఈ ఆలయానికి   Angamali రైల్వే స్టేషన్  8 కిలోమీటర్ల దూరం లో ఉన్నది ఇది  రావణ వధ అనంతరం భరతుడు శ్రీ రామచంద్రుణ్ణి రాజ్య పాలనను చేపట్టవలసినదిగా కోరిన ప్రదేశమని  ఇక్కడి వారి నమ్మకం.
source:wikipedia

ఇక్కడకు 30కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఎర్నాకులం దేశం లోనే ఒక ప్రముఖనగరం ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది . ఆల్వా  (Aluva ) తాలూకా కేంద్రం నుండి moozikkulam కు బస్సులున్నవి . 

13, మార్చి 2016, ఆదివారం

తమిళనాడు కు మదురై మకుటం

మీనాక్షి ఆలయం ,మదురై  

                                                   తమిళనాడు లోని ఒక ప్రముఖ నగరం మదురై , ఇక్కడ రాష్ట్రం లోనే పేరొందిన మీనాక్షి అమ్మన్ దేవాలయం ఉన్నది ఇది తమిళుల సాంస్కృతిక వారసత్య చిహ్నం గా పేరుపొందింది . ఇక్కడ శంకరుడు సుందరనాథుడు /సుందరేశ్వరుడు  గాను పార్వతి మీనాక్షి అమ్మ గాను పూజింపబడుచున్నారు. తమిళనాట అతి పురాతన కాలం నుండి పరిచయం లో ఉన్న దేవాలయం  ప్రస్తుత దేవాలయ కట్టడాలన్ని  16-17 శతాబ్దాలలో నిర్మిచబడినాయి.ఆలయ ప్రాంగణం లో ఉన్న వేయి కాళ్ళ మండపంలో మ్యూజియం నడపబడుచున్నది .

దర్శనం వేళలు :-ఉదయం 5:00నుండి -మధ్యాహ్నం 12:30 వరకు సాయంత్రం 4:00నుండి- రాత్రి 10:00వరకు
                                        కుమార స్వామికి  తమిళనాడు లో గల 6 ముఖ్యమైన దేవాలయాలలో 2 మదురై కి దగ్గర లోనే  ఉన్నవి . మీనాక్షి అమ్మన్ దేవాలయానికి 8కిలోమీటర్ల దూరం లో(తిరుమంగళం వెళ్ళే దారిలో ) తిరుప్పరంకుండ్రం నందు ,మరొకటి 25 కిలోమీటర్ల దూరంలో  అళగర్ కొయిల్ మీదుగా  పళముదిర్ చోళై లోను ఉన్నవి .దేశం లోని అన్ని ప్రాంతాలతో మదురై నగరం వాయు ,రోడ్డు ,రైలు మార్గాల తో కలిపి ఉన్నది  .                              

9, మార్చి 2016, బుధవారం

ఆధ్యాత్మికానికి "ఆది" వరస ,వర్తకానికి "పట్టు" కొమ్మ కంచి

   "కంచి" ఒక-శక్తి పీఠం, పృధ్వి లింగ క్షేత్రం,108 వైష్ణవ క్షేత్రాల్లో కొన్ని  

                                     
        కధ కంచికి మనం ఇంటికి అనే మాటను మన చిన్నతనం లో అమ్మమ్మలు, నానమ్మలు కథలు చెప్పినప్పుడు   చివరలో  "కధ  కంచికి మనం ఇంటికి" అనే పదం బందం  తో కధ ను పూర్తి చేసే వారు.పల్లవుల చోళుల రాజధాని గా వెలుగొందిన ఈ క్షేతం  తమిళనాడు రాష్ట్రం లో చెన్నై నగరానికి 75 కిలోమీటర్ల దూరంలో   ఉన్నది. పైనుదహరించిన పదబంధం కంచి/కాంచీపురం  యొక్క ప్రాచీనతని, ఖ్యాతిని, ఆధ్యాత్మిక బావాన్ని తెలియచేస్తున్నది. మనిషి జివితమంతా భగవంతుడికే అర్పితం  అనే భావం (ఇక్కడ ప్రాస కలిసింది కూడా) నాకు ఇక్కడ కనిపిస్తుంది. కంచి కామాక్షీ గా పేరొందిన కామాక్షి అమ్మళ్ దేవాలయం  18 శక్తి పీఠాల్లో ఒకటి. పంచ భూత లింగాల్లో పృధ్వి లింగం ఏకాంబరేశ్వర దేవాలయంలో ఉన్నది. 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన  వరద రాజ పేరుమాళ్ (వరద రాజ స్వామి) ఆలయం ఉన్నది .ఒకప్పుడు శివ కంచి , విష్ణు కంచి అని   ఆయా ఆలయాలు ఉన్న ప్రాంతాలను బట్టి పేరు కైతే పిలుచుకున్నారు కాని శివకంచి లో విష్ణువు కు, విష్ణు కంచి లో శివుడికి ఆలయాలున్నాయి .


కామకోటి పీఠం:- దేశం లోనే అతి పురాతనమైన ఈ పీఠాన్నిఆది శంకరా చార్యులు వారు స్థాపించారు . ఈపీఠం పర్యవేక్షణ లోనే కంచి ఆలయాలు ఉన్నాయి .   






కామాక్షి అమ్మాళ్ దేవాలయం :- షుమారు 5 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయంలో తలపై చంద్ర వంక ను, ఒక చేతిలో చెరకు విల్లు మరోచేతిలో చిలుక తో దర్సన మిస్తున్న పార్వతి దేవి అవతారం "కామాక్షి " అమ్మవారు. పూర్వం ఈ దేవత ఉగ్ర రూపిణి  అని , ఆది శంకరాచార్యులు వారు. శ్రీ చక్రాన్ని స్థాపించి  ఆమె ను శాంత మూర్తి గా అవతరింప /ప్రతిష్టించారని పురాణాలు  తెలుపుతున్నాయి. 

దర్శనం వేళలు ఉదయం 06:00 నుండి 12:00; సాయంత్రం 04:00 నుండి 08:00 వరకు .


ఏకాంబరేశ్వర ఆలయం 

ఏకాంబరేశ్వర దేవాలయం:- షుమారు 50 ఎకరాల్లో విస్తరించిన ఈ దేవాలయం లో ఉన్నది పంచభూత లింగాల్లో ఒకటైన పృధ్వి(భూ) లింగం. మామిడి వృక్షం వద్ద పార్వతి దేవి చేసిన  తపస్సు కు మెచ్చి శివుడు ప్రత్యక్షమైన ప్రదేశం ఇది. 3500 సంవత్సరాల వయస్సు గలదనీ ఆ మామిడి చెట్టు కాండాన్ని ఆలయం లోనే ప్రత్యేకంగా భద్రపరచారు.  ఇక్కడ ఉన్న చిన్న ఆలయం లో విష్ణువు  వామన మూర్తిగా దర్శనమిస్తాడు. 1008 శివలింగాలు ఇక్కడి మండపం లో ఉన్నాయి .
దర్శనం వేళలు ఉదయం 05:00 నుండి 12:30; సాయంత్రం 04:00 నుండి 08:30 వరకు .
వరద రాజ పెరుమాళ్  ఆలయం 
source:wikipedia 
 వరద రాజ పేరుమాళ్ (వరద రాజ స్వామి ) ఆలయం :- 106 వైష్ణవ పుణ్య క్షేత్రాలలో  ఈ ఆలయం కుడా ఒకటి . షుమారు 20 ఎకరాల్లో ఈ ఆలయం ఉన్నది . విష్ణు మూర్తి వరదరాజ పెరుమాళ్ గాను లక్ష్మి దేవి పేరుందేవి తాయార్ గాను పూజింప బడుచున్నారు . సూర్య చంద్రులకు ప్రతీకలు గా బంగారు బల్లి, వెండి బల్లి ఈ ఆలయ ప్రాగణం లో ఉన్నాయి శాప గ్రస్తులైన గౌతమ మహర్షి శిష్యులు గా కథ ప్రచారం లో ఉన్నది . వీటిని తాకితే బల్లి పాటు దోషాలు ,ఆరోగ్య దోషాలు పోతాయని ఒక విశ్వాసం ప్రచారం లో ఉన్నది .
 దర్శనం వేళలు ఉదయం 06:00 నుండి 12:00; సాయంత్రం 04:30 నుండి 09:30 వరకు .

           ఇంకా కుమార కొట్టం ఆలయం, కైలాసనాథ ఆలయం, వామనమూర్తి దేవాలయం, కైలాసనాథ దేవాలయం,  ఆదికేశవ పెరుమాళ్  దేవాలయం మొదలైనవి ఉన్నాయి .

                               ఆద్యాత్మికం గానే కాక , వ్యాపార రీత్యా ఈ పట్నం పట్టు పరిశ్రమ కు ప్రసిద్ది చెందింది . పట్టు చీరలు -వగైరా వస్త్రాలు దేశం లోని అన్ని ప్రాంతాలకే కాక విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. దూర ప్రాంత రైళ్ళు అతి తక్కువగా నడిచే అర్కోణం -చెంగల్పట్టు  బ్రాంచ్ లైన్లో కాంచీపురం రైల్వే స్టేషన్  ఉన్నప్పటికీ  36 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగల్ పట్టు రైల్వే జంక్షన్ మీదుగా దేశం లోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్ళు రాకపోకలు జరుగుతున్నాయి .  చెంగల్ పట్టు కు తూర్పు దిక్కున సముద్ర తీరంలో ప్రముఖ పర్యాటక కేంద్రం మహాబలి పురం (28KM ) ఉన్నది . 75 కిలో మీటర్ల దూరం లో ఉన్న  చెన్నై నుండి ఇంకా  రాష్త్రం లోని ప్రధాన నగరాలనుండి ఇక్కడ బస్సులు నడుస్తున్నాయి.