మీనాక్షి ఆలయం ,మదురై
తమిళనాడు లోని ఒక ప్రముఖ నగరం మదురై , ఇక్కడ రాష్ట్రం లోనే పేరొందిన మీనాక్షి అమ్మన్ దేవాలయం ఉన్నది ఇది తమిళుల సాంస్కృతిక వారసత్య చిహ్నం గా పేరుపొందింది . ఇక్కడ శంకరుడు సుందరనాథుడు /సుందరేశ్వరుడు గాను పార్వతి మీనాక్షి అమ్మ గాను పూజింపబడుచున్నారు. తమిళనాట అతి పురాతన కాలం నుండి పరిచయం లో ఉన్న దేవాలయం ప్రస్తుత దేవాలయ కట్టడాలన్ని 16-17 శతాబ్దాలలో నిర్మిచబడినాయి.ఆలయ ప్రాంగణం లో ఉన్న వేయి కాళ్ళ మండపంలో మ్యూజియం నడపబడుచున్నది .
దర్శనం వేళలు :-ఉదయం 5:00నుండి -మధ్యాహ్నం 12:30 వరకు సాయంత్రం 4:00నుండి- రాత్రి 10:00వరకు
కుమార స్వామికి తమిళనాడు లో గల 6 ముఖ్యమైన దేవాలయాలలో 2 మదురై కి దగ్గర లోనే ఉన్నవి . మీనాక్షి అమ్మన్ దేవాలయానికి 8కిలోమీటర్ల దూరం లో(తిరుమంగళం వెళ్ళే దారిలో ) తిరుప్పరంకుండ్రం నందు ,మరొకటి 25 కిలోమీటర్ల దూరంలో అళగర్ కొయిల్ మీదుగా పళముదిర్ చోళై లోను ఉన్నవి .దేశం లోని అన్ని ప్రాంతాలతో మదురై నగరం వాయు ,రోడ్డు ,రైలు మార్గాల తో కలిపి ఉన్నది .


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి