శ్రీ రంగనాథ స్వామి ఆలయం, శ్రీరంగం, తమిళనాడు
శ్రీ రంగం పుణ్య క్షేత్రం కావేరి నదిపాయల మద్య తిరుచిరాపల్లి (తిరుచ్చి )జిల్లాలో ఉన్నది , ప్రపంచం లోని అతి పెద్ద దేవాలయాలలో ఇది ఒకటి ( 156 ఎకరాలలో విస్తరించి ఉన్నది ). శ్రీ మహా విష్ణువు స్వభువు గా వెలసిన 8 క్షేత్రాలలో ఇది ప్రధానమైనది . 108 వైష్ణవ దేవాలయాలలో ఇది ఒకటి . ఇక్కడ ఆలయాన్ని తిరువరంగ తిరుపతి ,పెరియా కొయిల్ ,భూపాల వైకుంఠం,భోగమండపంఅని కుడా పిలుస్తారు . 7 ప్రాకారాలతో కూడిన ఈ ఆలయ ప్రాంగణం లో శ్రీ రంగనాథ స్వామి ,రంగనాయకి అమ్మవార్ల తో పాటు 50 ఇతర దేవతా మూర్తులకు ఉపాలయాలు ఉన్నాయి .
చెన్నై నగరానికి 340 కిలోమీటర్ల దూరం లో ఉన్నది ,చెన్నై ,మదురై , రామేశ్వరం మొదలైన ప్రాంతాలకు railway connectivity ఉన్నది . ఇంచుమించుగా తమిళనాడు నడిబోడ్డున ఉన్న శ్రీరంగానికి రాష్ట్రము లోని అన్ని ప్రాంతాల నుండి ఇక్కడకు బస్సు సర్వీసులు నడపబడుచున్నవి . ఎయిర్ పోర్ట్ ఉన్న తిరుచిరాపల్లి కి అతిదగ్గరలో15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది .
65 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూరు లో యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడిన బృహదీశ్వర ఆలయం ఉన్నది . 108 వైష్ణ వ దివ్య క్షేత్రాలు పుండరికాక్ష పెరుమాళ్ దేవాలయం తిరుచినాపల్లి కి 15 కిలోమీటర్ల దూరంలో తిరువెల్లారై నందూ, మనవాళ పెరుమాళ్ ,కమలవల్లి ఆలయం తిరుక్కోళి తిరుచిరాపల్లి నగరం లోనే ఉరయూర్ లోను ఉన్నవి . శ్రీ రంగం క్షేత్రం లోనే రంగనాథ స్వామి వారి దేవాలయానికి కిలోమీటర్ల దూరంలోనే పంచ భూత లింగాలలో ఒకటైన( జల లింగం) జంబుకేశ్వరలింగ క్షేత్రం ఉన్నది .


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి