108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఇది ఒకటి.ఈ క్షేత్రాన్ని తిరుక్కోళి (మోక్ష మిచ్చె ఆలయం )అని కూడా పిలుస్తారు .అళ గీయ మనవాళ పెరుమాళ్ అనగా మనవాళ యోగి చేత కొలవబడిన సుందరమైన దేవుడని అర్ధం . పురాణాల ప్రకారంఇక్కడ శ్రీ మహావిష్ణువు శ్రీ రంగం లోని శ్రీ రంగ నాదుడే కాని ఇక్కడ చోళ రాజుకు కమలం లో సుందర శిశువు రూపం లో దొరకిన శ్రీ మహా లక్ష్మి ( ఇక్కడకమలవల్లి /వాస లక్ష్మి గా పిలువబడు చున్నది) ని యుక్త వయస్సు వచ్చిన పిమ్మటవివాహమాడిఅళ గీయ మణ వాళ పెరుమాళ్ గా (యోగి మన వాళ న్- పూజించటం /కొలవటంచేత )పిలువబడుచున్నాడు
దర్శనం వేళలు ఉదయం 5:00 నుండి 12:30 వరకు ,సాయంత్రం 5:00 నుండి 8:30వరకు
దర్శనం వేళలు ఉదయం 5:00 నుండి 12:30 వరకు ,సాయంత్రం 5:00 నుండి 8:30వరకు
ఇక్కడకు 65 కిలోమీటర్ల దూరంలో తంజావూరు నందు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింప బడిన బృహదీశ్వర ఆలయమూ , ఇంకా,108 వైష్ణవ దివ్య క్షేత్రా లైన ఒకటైన పుండరికాక్ష పెరుమాళ్ దేవాలయం తిరుచినాపల్లి కి 19 కిలోమీటర్ల దూరంలో తిరువెల్లారై నందూ ,రంగనాథ స్వామి దేవాలయం ఉన్న శ్రీరంగ క్షేత్రం , 7 కిలోమీటర్ల దూరం లో కావేరి నది ద్వీపం లో ఉన్నది ,ఇదే శ్రీరంగ ద్వీపం లో పంచ భూత లింగాలలో ఒకటైన( జల లింగం)జంబుకేశ్వరలింగ క్షేత్రం ఉన్నవి .
ఉరయూర్ ఒకపుడు గ్రామం గా ఉన్నప్పటికీ ,ఇప్పుడు విస్తరించిన తిరుచిరా పల్లి (trichy) పట్టణం లో కలసిపోయింది .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి