ఈ కేదారే శ్వర జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ రాష్ట్రం నందు హిమాలయాల్లో ఉన్నది ఈ ఆలయం సంవత్సరం లో 6 మాసాలు మంచులో కప్పబడి మూసి వేయబడి ఉంటుంది (కార్తిక పౌర్ణమి నుండి షుమారుగా మే నెల వరకు ) ఆలయాన్ని మూసివేసే సమయం లో ఆలయం లో దీపం వెలిగిస్తారు మరల గుడిని తెరిచే వరకు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది ఆ దీప దర్శనం శివుని ఆశీర్వచనంగా భక్తులు భావిస్తారు. పాండవులు ఇక్కడ మహా శివుణ్ణి సేవించినట్లు స్థలపురాణాలు తెలుపుతున్నాయి .
ఈ యాత్ర అంతా హరిద్వార్ నుండి, అక్కడ పారే గంగా నది, దాని ఉపనదుల తీరాల వెంబడి, రమ్యమైన హిమాలయ పర్వత శ్రేణుల మద్య సాగుతుంది,హరిద్వార్కు 20 కిలో మీటర్ల దూరంలో ఋషికేశ్ ప్రముఖ పుణ్యక్షేత్రం ఇక్కడ వరకు కుడా రైళ్ళు నడుస్తుంటాయి.
![]() |
గంగ -అలకనంద నది సంగమం -ఋషికేశ్
ఇక్కడ(ఋషికేశ్)నుండి 75కిలో మీటర్ల దూరం లో దేవ ప్రయాగ క్షేత్రం ఉన్నది . ఇక్కడ గంగ నదితో అలక్ నంద నది సంగమిస్తుంది .
|
ఇక్కడ నుండి 70కిలోమీటర్ల దూరం అలకనంద నది తీరం వెంబడి
ప్రయాణించిన తరువాత రుద్ర ప్రయాగ క్షేత్రం వస్తుంది ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం వలన పాపాపంక్తిలమైన పాండవులకు శివుడు దర్శన మివ్వకపోవటం చేత ఈ క్షేత్రాన్ని గుప్త కాశి అని పిలుస్తారు ఇక్కడ అలకనంద నదిలో మందాకినీ నది కలుస్తుంది.
ప్రయాణించిన తరువాత రుద్ర ప్రయాగ క్షేత్రం వస్తుంది ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం వలన పాపాపంక్తిలమైన పాండవులకు శివుడు దర్శన మివ్వకపోవటం చేత ఈ క్షేత్రాన్ని గుప్త కాశి అని పిలుస్తారు ఇక్కడ అలకనంద నదిలో మందాకినీ నది కలుస్తుంది.
ఇక్కడ నుండి మందాకినీ నది తీరం వెంబడి 72 కిలోమిత్రాల ప్రయాణం
తరువాత గౌరికుండ్ క్షేత్రం వస్తుంది .ఇక్కడ వేడినీటి బుగ్గలు /ఉష్ణ కుండాలు ఉన్నాయి .పార్వతి దేవికి మరో పేరు గౌరీ, ఈగౌరీకుండ్ క్షేత్రంలోనే శివుడికై పార్వతి తపమాచరించిన ప్రదేశం ఇదే, వేడి నీటి కుండాలలో పార్వతీదేవి స్నాన సమయంలో నలుగు పిండితో గణేసుణ్ణి చేసింది ఇక్కడే.
గౌరికుండ్ చేరిన తరువాత అక్కడ నుండి 14 కిలోమీటర్ల దూరం కాలినడకన , డోలీ ల మీద లేదా గుఱ్ఱాల మీద కేదార్ నాథ్ కు చేరవలసి ఉంటుంది.
కేదారేశ్వర జ్యోతిర్లింగం: courtesy : news. maffat. com
ఇక్కడ ప్రతి కూడలి లోను అన్ని స్థాయిల్లో మెరుగైన వసతులిచ్చే హోటల్లు ,రెస్ట్ హౌస్లు" ఉన్నాయి . హరిద్వార్ కు దేశం లోని అన్ని ప్రాంతాలనుండి రైళ్ళు నడుస్తున్నాయి ,డిల్లి నుండే కాక ఇతర పరిసర ప్రాంత నగరాల నుండి హరిద్వార్ కు పలు బస్సు సర్వీసులు నడుస్తుంటాయి ఇక్కడ నుండి గౌరికుండ్ కు (235 కిలోమీటర్లు) పరిమితంగా బస్సులు నడుస్తుంటాయి హరిద్వార్ కు 35 కిలోమీటర్ల దూరంలో డెహ్రడూన్ విమానాశ్రయం ఉన్నది.




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి