భీమ శంకర జ్యోతిర్లింగం, భీమ శంకర్
భీమ శంకర్ క్షేత్రం మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత పంక్తుల్లో ఉన్నది .పౌరాణిక కాలం లో ఇక్కడ పరమ శివుడు భీమాసురుణ్ణి వధించి (యుద్ద సమయం లో శివుడి స్వేద బిందువుల నుండి భీమానది పుట్టిందని ఇక్కడి వారి విశ్వాసం, ఇది కృష్ణా నదిలో కలుస్తుంది ) దేవతల కోరిక పై భీమ శంకరుడు గా అవతరించాడు. ఆలయానికి 6-7 కిలోమీటర్ల దూరంలో గుప్త భీమ శంకర లింగం ఉన్నది. ఆలయ చరితలో చివరగా మహారాష్ట్ర పాలకుడు నానా పడ్నవీశ్ ఈ ఆలయానికి మెరుగులు దిద్దాడు.
![]() |
| Bhimashankar Jyotirlingam |
ముంబై నుండి లోనావాల మీదుగా 200 కిలోమీటర్ల దూరం లో ఉన్నది. పశ్చిమ , ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చే వారికి నాసిక్ రోడ్ నుండి 210 కిలో మీటర్లు, హైదరాబాద్ ఇంకా దక్షినాది రాష్ట్రాల నుండి వచ్చే యాత్రికులకు ఈ సహ్యాది కొండల్లో ప్రయాణానికి మాత్రం 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూనే మొదటి మజిలి అవుతుంది. పూనే నుండి రాజ్ గురు నగర్ (ప్రముఖ స్వాతంత్ర్య సమర యోదుడు , భగత్ సింగ్ తో పాటు ఉరికంబ మెక్కిన "రాజ్ గురు " స్వ గ్రామం) గ్రామం మీదుగా ఈ పుణ్య క్షేత్రం చేరు కోవచ్చు.
భీమ శంకర్ పుణ్య క్షేత్రం కు వచ్చే యాత్రికుల నిమిత్తం భీమాశంకర్ లోను పరిసర ప్రాంతాలలోను అక్కడక్కడ వసతి సౌకర్యాలు ఉన్నాయి . కానీ భీమశంకర ఆలయం, అక్కడి అందమైన కొండలు (చిన్న పాటి ట్రెకింగ్ ) దర్శించడం అంతా ఒక్క day timeలో ముగిసే యాత్ర కాబట్టి పూనే నుండే వెళ్ళే వారు food packets వగైరాలతో వెళ్ళటం ఉత్తమం.చత్రపతి శివాజీ జన్మించిన కోట శివనేరి ఇక్కడకు 70 కిలోమీటర్ల దూరం లో ఉన్నది.



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి