"కంచి" ఒక-శక్తి పీఠం, పృధ్వి లింగ క్షేత్రం,108 వైష్ణవ క్షేత్రాల్లో కొన్ని
కధ కంచికి మనం ఇంటికి అనే మాటను మన చిన్నతనం లో అమ్మమ్మలు, నానమ్మలు కథలు చెప్పినప్పుడు చివరలో "కధ కంచికి మనం ఇంటికి" అనే పదం బందం తో కధ ను పూర్తి చేసే వారు.పల్లవుల చోళుల రాజధాని గా వెలుగొందిన ఈ క్షేతం తమిళనాడు రాష్ట్రం లో చెన్నై నగరానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పైనుదహరించిన పదబంధం కంచి/కాంచీపురం యొక్క ప్రాచీనతని, ఖ్యాతిని, ఆధ్యాత్మిక బావాన్ని తెలియచేస్తున్నది. మనిషి జివితమంతా భగవంతుడికే అర్పితం అనే భావం (ఇక్కడ ప్రాస కలిసింది కూడా) నాకు ఇక్కడ కనిపిస్తుంది. కంచి కామాక్షీ గా పేరొందిన కామాక్షి అమ్మళ్ దేవాలయం 18 శక్తి పీఠాల్లో ఒకటి. పంచ భూత లింగాల్లో పృధ్వి లింగం ఏకాంబరేశ్వర దేవాలయంలో ఉన్నది. 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన వరద రాజ పేరుమాళ్ (వరద రాజ స్వామి) ఆలయం ఉన్నది .ఒకప్పుడు శివ కంచి , విష్ణు కంచి అని ఆయా ఆలయాలు ఉన్న ప్రాంతాలను బట్టి పేరు కైతే పిలుచుకున్నారు కాని శివకంచి లో విష్ణువు కు, విష్ణు కంచి లో శివుడికి ఆలయాలున్నాయి .
కామకోటి పీఠం:- దేశం లోనే అతి పురాతనమైన ఈ పీఠాన్నిఆది శంకరా చార్యులు వారు స్థాపించారు . ఈపీఠం పర్యవేక్షణ లోనే కంచి ఆలయాలు ఉన్నాయి .
కామాక్షి అమ్మాళ్ దేవాలయం :- షుమారు 5 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయంలో తలపై చంద్ర వంక ను, ఒక చేతిలో చెరకు విల్లు మరోచేతిలో చిలుక తో దర్సన మిస్తున్న పార్వతి దేవి అవతారం "కామాక్షి " అమ్మవారు. పూర్వం ఈ దేవత ఉగ్ర రూపిణి అని , ఆది శంకరాచార్యులు వారు. శ్రీ చక్రాన్ని స్థాపించి ఆమె ను శాంత మూర్తి గా అవతరింప /ప్రతిష్టించారని పురాణాలు తెలుపుతున్నాయి.
దర్శనం వేళలు ఉదయం 06:00 నుండి 12:00; సాయంత్రం 04:00 నుండి 08:00 వరకు .
దర్శనం వేళలు ఉదయం 06:00 నుండి 12:00; సాయంత్రం 04:00 నుండి 08:00 వరకు .
![]() |
| ఏకాంబరేశ్వర ఆలయం |
ఏకాంబరేశ్వర దేవాలయం:- షుమారు 50 ఎకరాల్లో విస్తరించిన ఈ దేవాలయం లో ఉన్నది పంచభూత లింగాల్లో ఒకటైన పృధ్వి(భూ) లింగం. మామిడి వృక్షం వద్ద పార్వతి దేవి చేసిన తపస్సు కు మెచ్చి శివుడు ప్రత్యక్షమైన ప్రదేశం ఇది. 3500 సంవత్సరాల వయస్సు గలదనీ ఆ మామిడి చెట్టు కాండాన్ని ఆలయం లోనే ప్రత్యేకంగా భద్రపరచారు. ఇక్కడ ఉన్న చిన్న ఆలయం లో విష్ణువు వామన మూర్తిగా దర్శనమిస్తాడు. 1008 శివలింగాలు ఇక్కడి మండపం లో ఉన్నాయి .
దర్శనం వేళలు ఉదయం 05:00 నుండి 12:30; సాయంత్రం 04:00 నుండి 08:30 వరకు .
వరద రాజ పేరుమాళ్ (వరద రాజ స్వామి ) ఆలయం :- 106 వైష్ణవ పుణ్య క్షేత్రాలలో ఈ ఆలయం కుడా ఒకటి . షుమారు 20 ఎకరాల్లో ఈ ఆలయం ఉన్నది . విష్ణు మూర్తి వరదరాజ పెరుమాళ్ గాను లక్ష్మి దేవి పేరుందేవి తాయార్ గాను పూజింప బడుచున్నారు . సూర్య చంద్రులకు ప్రతీకలు గా బంగారు బల్లి, వెండి బల్లి ఈ ఆలయ ప్రాగణం లో ఉన్నాయి శాప గ్రస్తులైన గౌతమ మహర్షి శిష్యులు గా కథ ప్రచారం లో ఉన్నది . వీటిని తాకితే బల్లి పాటు దోషాలు ,ఆరోగ్య దోషాలు పోతాయని ఒక విశ్వాసం ప్రచారం లో ఉన్నది .
![]() |
| వరద రాజ పెరుమాళ్ ఆలయం source:wikipedia |
దర్శనం వేళలు ఉదయం 06:00 నుండి 12:00; సాయంత్రం 04:30 నుండి 09:30 వరకు .
ఇంకా కుమార కొట్టం ఆలయం, కైలాసనాథ ఆలయం, వామనమూర్తి దేవాలయం, కైలాసనాథ దేవాలయం, ఆదికేశవ పెరుమాళ్ దేవాలయం మొదలైనవి ఉన్నాయి .
ఇంకా కుమార కొట్టం ఆలయం, కైలాసనాథ ఆలయం, వామనమూర్తి దేవాలయం, కైలాసనాథ దేవాలయం, ఆదికేశవ పెరుమాళ్ దేవాలయం మొదలైనవి ఉన్నాయి .
ఆద్యాత్మికం గానే కాక , వ్యాపార రీత్యా ఈ పట్నం పట్టు పరిశ్రమ కు ప్రసిద్ది చెందింది . పట్టు చీరలు -వగైరా వస్త్రాలు దేశం లోని అన్ని ప్రాంతాలకే కాక విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. దూర ప్రాంత రైళ్ళు అతి తక్కువగా నడిచే అర్కోణం -చెంగల్పట్టు బ్రాంచ్ లైన్లో కాంచీపురం రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగల్ పట్టు రైల్వే జంక్షన్ మీదుగా దేశం లోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్ళు రాకపోకలు జరుగుతున్నాయి . చెంగల్ పట్టు కు తూర్పు దిక్కున సముద్ర తీరంలో ప్రముఖ పర్యాటక కేంద్రం మహాబలి పురం (28KM ) ఉన్నది . 75 కిలో మీటర్ల దూరం లో ఉన్న చెన్నై నుండి ఇంకా రాష్త్రం లోని ప్రధాన నగరాలనుండి ఇక్కడ బస్సులు నడుస్తున్నాయి.



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి