జంభుకేశ్వర,అఖిలాండేశ్వరి దేవ స్థానం,
తిరువనైకావల్ ,శ్రీరంగం .
పంచ భూతలింగాలలో ఒకటైన జలలింగం శ్రీరంగక్షేత్రం ఉన్న కావేరి నది ద్వీపం లోనే జంభుకేశ్వర క్షేత్రం లో ఉన్నది. ఈ క్షేత్రాన్ని స్థానికం గా తిరువనై కోయిల్ గా పిలుస్తారు . పరమ శివుడి ఆగ్రహానికి గురియైన పార్వతీదేవి యోగినిగా మారి జంబు వృక్షం క్రింద అప్పు (నీరు) లింగాన్ని ప్రతిష్టించి తపమాచరించగా శివుడు సంతసించి ఆమెకు శివ జ్ఞానాన్నిభోదించాడని స్థల పురాణం. ఇక్కడ పార్వతీదేవి శివుడికి పూజాదికాలు నిర్వహించిందని, అందుకు చిహ్నం గా ప్రతిరోజూ నిర్ణిత సమయంలో పూజారి చీర ధరించి పూజలు నిర్వహిస్తారు. పార్వతీదేవి అఖిలాండేశ్వరి గాను జంబు వృక్షం క్రింద (ఒకానొక యోగి పుంగవునకు పరమేశ్వరుడు ఇచ్చిన వరం నిమిత్తం) వేలియటం చేత శివుడు జంభుకేశ్వరుడు గాను పూజ లందుకుంటున్నారు . శ్రీ కాళహస్తి స్థల పురాణాన్ని పోలిన సాలెపురుగు ,ఏనుగు ల కథ కూడా ఆలయ చారిత్రిక ప్రస్తావనలో కనపడుతుంది .
ఈ క్షేత్రం శ్రీరంగం లోని శ్రీ రంగనాథ స్వామీ ఆలయానికి అతి సమీపంలోనే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది . తిరుచ్చి గా పిలువబడే తిరుచిరాపల్లి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది . మంచి వసతి సౌకర్యాలున్న ఈ నగరం వాయు,రైలు ,రోడ్డు మార్గాలద్వారా రాష్ట్రంలోని ,ఇంకా దేశం లోని ముఖ్య నగరాలతో కలపబడి ఉన్నది.
దర్శనం వేళలు ఉదయం 6:00నుండి మధ్యాహ్నం 1200 వరకు , సాయంత్రం 5:00నుండి రాత్రి 9:00 వరకు


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి