ఈ పుష్పాల లోయ ఉత్తరాఖండ్ లో బదరీనాథ్ కు దగ్గరగా చమేలి జిల్లాలో షుమారు 80 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నది . ఈ లోయకు దగ్గరలో ఉన్న ప్రధాన పట్నం జోషిమఠ్ లేదా జ్యోతిర్ మఠ్. హరిద్వార్ ,ఋషికేశ్ ల నుండి బదరీనాథ్ వెళ్ళే మార్గం లో ఉన్నది . బదరీనాథ్ యాత్ర సాగుతున్న సమయంలో పలు బస్సు సర్వీసెస్ జ్యోతిమఠ్ మీదుగా ప్రయాణిస్తాయి . దగ్గరలో ఉన్న విమానాశ్రయం డెహ్రాడూన్ లో ఉన్నది
24, ఏప్రిల్ 2016, ఆదివారం
23, ఏప్రిల్ 2016, శనివారం
వారణాశి- పురాతన జ్యోతిర్లింగ లింగ క్షేత్రం
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో గంగా నది పశ్చిమ తీరం లో ఉన్న భూభాగానికి ఉత్తర దక్షిణ దిశల్లో వరుణ , అశి అనే చిన్న నదులు గంగా నదిలో కలుస్తూ ఉండటం చేత వారణాశి అని బెనారస్ ('వ' కారం 'బ' కారం గా మారి ) అని సంక్షిప్తం గా కాశి అని కూడా పిలుస్తారు ) ఇది అతి పురాతన జ్యోతిర్లింగ లింగ క్షేత్రం . ఈ క్షేత్రం లో పరమేశ్వరుణ్ణి కాశి విశ్వేశ్వరుడు గాను లేదా కాశి విశ్వనాథుడు గాను, పార్వతి దేవిని విశాలాక్షి గాను కొలుస్తుంటారు . చరిత్రలో ఈ ఆలయం పలుమార్లు ముస్లిం దండ యాత్రల్లో నాశనమై , మరల పునఃనిర్మితమైనది . ఆ క్రమం లో 1780 సంవత్సరం లో ఇండోర్ పాలకురాలు రాణి అహల్యాబాయి హోల్కర్ చేత పునఃరుద్దరణ కావించబడినది . మీరా ఘాట్ లో విశాలాక్షి దేవాలయం అష్టా దశ శక్తి పితాల్లో ఒకటి , కాశి లో గల నవ గౌరీ లలో ఈ ఆలయం ఒకటి
Mount Abu, Rajasthan
మౌంట్ అబూ, రాజస్తాన్
మౌంట్ అబూ ఆరావళి పర్వతాలలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం . ఇది సముద్ర మట్టానికి ఎగువన ఉన్న ఎత్తైన పిత భూమి లో బాగం , గుజరాత్ రాష్ట్రానికి సరిహద్దు లో ఉన్నది (శిరోహి జిల్లా ). అబూ రోడ్ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ .భారత దేశం లో ఉన్న ప్రముఖ తాత్విక విజ్ఞాన సంస్థ బ్రహ్మ కుమారి విశ్వ విద్యాలయం ప్రధాన కేంద్రం ఇక్కడే ఉన్నది .
19, ఏప్రిల్ 2016, మంగళవారం
కోల్ కట ,వెస్ట్ బెంగాల్
Some of Visiting Places in Kolkata
కాళీ ఆలయం , దక్షిణేశ్వర్ : హౌరా స్టేషన్ కు 11 కిలోమీటర్ల దూరాన హుగ్లీ నది తూర్పు తీరం లో ఉన్నది స్వామి వివేకానంద గురువర్యులు రామ కృష్ణ పరమహంస పౌరోహిత్యం నిర్వహించిన ఆలయం ఇదే .
సందర్శన సమయాలు :
ఉదయం 6:00నుండి మద్యాహ్నం 12:30వరకు సాయంత్రం 3:30నుండి రాత్రి 8:30 వరకు
![]() |
| దక్షిణే శ్వర్ టెంపుల్ |
విక్టోరియా మెమోరియల్ హాల్,ఆలిపూర్ : 1901 సంవత్సరం లో మరణించిన బ్రిటిష్ రాణి జ్ఞాపకార్థం అప్పటికి రాజధాని గా ఉన్న ఈ నగరం లో భవనాన్ని నిర్మించడం జరిగినది . విశాలమైన గార్డెన్ గలిగిన ఈ భవనం ప్రస్తుతం ఒక మ్యూజియం ఇందులో పలురకాలైన గ్యాలరీలు ఉన్నాయి . హౌరా రైల్వే స్టేషన్ కు 8 కిలోమీటర్ల దూరం లో ఉన్నది .
కాళీ ఘాట్ కాళీ ఆలయం,ఆలిపూర్ :-18 శతాబ్దం లో నిర్మిచబడిన ఆలయం , 51 శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పబడుతుంది . ఇది కలకత్తా నగరం లో సుప్రసిద్ద ఆలయం . హౌరా రైల్వే స్టేషన్ నుండి విక్టోరియా మెమోరియల్ హాల్ మీదుగా కు 12 కిలోమీటర్ల దూరంలో(విక్టోరియా మెమోరియల్ హాల్ కు 4 కిలోమీటర్ల దూరం ) ఉన్నది .
సందర్శన సమయాలు : ఉదయం 9:00నుండి సాయంత్రం 4:00నుండి
బేలూర్ మఠం:- ఇది స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ సంస్థ కు ప్రధాన కేంద్రం . 40 ఎకరాల్లో విస్తరించి ఉన్నది . ఇది దక్షిణే శ్వర్ కాళీ టెంపుల్ మార్గం లో హౌరా రైల్వయ స్టేషన్ కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది .
![]() |
| బేలూరు మఠం లోని ఆలయం |
సెయింట్ జాన్'స్ చర్చ్:-ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో నిర్మించారు . దేశం లో ఉన్న పురాతన చర్చ్ లలో ఇది ఒకటి . 200 సంవత్సరాలకు పైబడిన చరిత్రకు సాక్ష్యమైన ఈ చర్చ్ క్రికెట్ గ్రౌండ్ "ఈడెన్ గార్డెన్" కు సమీపంలోనే హుగ్లీ నది తీరంలో ఉన్నది .ఒకప్పుడు ఇది Cathedral గా కూడా వ్యవహరించబడినది .
13, ఏప్రిల్ 2016, బుధవారం
కుంభ మేళా జరిగే మూడు మూర్తుల త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం , నాసిక్
మూడుమూర్తుల త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం,
త్రయంబక్ ,మహారాష్ట్ర
ప్రముఖ పారిశ్రామిక నగరం నాసిక్ కు 28 కిలోమీటర్ల దూరం లో మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల బ్రహ్మగిరుల్లో త్రయంబక్ గ్రామం లో ఈ జ్యోతిర్లింగం ఉన్నది. ఆలయం నల్ల రాతితో కట్టబడినది స్వయంభువుగా వెలసిన ఈ జ్యోతిర్లింగం లో (yoni pitam మధ్యన గుంట లో మూడు లింగ స్వరూపాలు)మూడు ముఖాలు (బ్రహ్మ,విష్ణు,మహేశ్వరుడు) అగుపించటం ఇక్కడి ప్రత్యేకత. ఈ మొత్తం శివలింగానికి అలంకరించిన వజ్రఖచిత కిరీటం పాండవుల కాలం నాటిదని ప్రతీతి. దిన్ని ప్రతి సోమవారం యాత్రికులు సాయం వేళ చూడవచ్చు. ప్రధాన ఆలయానికి ఎదురుగా నందీశ్వరుని మందిరం ఉన్నది. గర్భాలయం లోనికి ఇప్పటి వరకు పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్నది . మహిళల పట్ల ఈ విషయం లో వివక్ష చూపటం ఈ మద్య బాగా వివాద మగుట చేత 03. 04. 2016 తేదిన "పురుషులకు కూడా గర్బాలయ ప్రవేశాన్ని " నిష్షేదిస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి .
ఉజ్జయిని, త్రయంబకేశ్వరం, జ్యోతిర్లింగాలు కల్గిన ఈ క్షేత్రాల్లో మాత్రమే కుంభ మేళా ఉత్సవాలు జరుగుతాయి. గౌతమ మహర్షి కి మహా శివుడు ఇచ్చిన వరం పలితంగా గంగ ఇక్కడ గోదావరి గా ఉద్బవించింది. కాలసర్ప దోష నివారణ పూజలు ఇక్కడ జరుపుతారు. ఇక్కడ కుశావర్త పుష్కరిణి ఉన్నది ఇందులోకి నీరు ఎలావస్తుందో తెలియనప్పటికీ గోదావరి నది జలాలు గానే అందరు భావిస్తారు ఈ పుష్కరిణి చుట్టూ పలు శివాలయాలు, ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి.
త్రయంబక్ నాసిక్ నగరానికి 28 కిలోమీటర్ల దూరం లో ఉన్నది. నాసిక్ నుండి ఇక్కడకు చక్కని రోడ్ ప్రయాణ సౌకర్యాలున్నాయి. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్కు / ద్వారా దేశం లోని ప్రధానమైన స్టేషన్ ల నుండి రైళ్ళు నడుస్తున్నాయి. నాసిక్ లో డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ ఉన్నది.
Note:-13-04-2016 నుండి పురుషుల గర్బాలయ దర్శనం పై ఉన్న నిషేదాన్ని తొలగించినట్లు ఈనాడు దినపత్రికలో వార్త ప్రచురించ బడినది
4, ఏప్రిల్ 2016, సోమవారం
శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవ స్థానం ,తాడిపత్రి
అందమైన శిల్ప కళా నిలయం
జిల్లా కేంద్రం అనంతపురం కు 57 కిలోమీటర్ల దూరంలో కర్నూలు ,కడప జిల్లాల సరిహద్దులకు దగ్గరగా ఉన్నది తాడిపత్రి. మేము 26-03-2016 తేదిన తాడిపర్తి వెళ్ళడం జరిగింది . తిరుపతి నుండి షుమారు 250 కిలోమీటర్లు కడప మీదుగా 5 గంటలు బస్సు ప్రయాణం చేసి రాత్రి 8 గంటలకు తాడిపర్తి చేరుకున్నాము . ఆ రాత్రి అక్కడే గెస్ట్ హౌస్ లో ఉండి ఉదయాన్నే చింతల వెంకటేశ్వ ర ఆలయాన్ని , ఆ పిదప బుగ్గ రామలింగేశ్వర ఆలయానికి వెళ్ళేము.
ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతా యుగం లో శ్రీ రామ చంద్రుడి చేత ప్రతిష్టిం బడిన లింగం కావటం చేత రామలింగేశ్వరుడు గా పూజింప బడుచున్నాడు . క్రీ .శ 1495 ప్రాంతంలో గుత్తి -గండికోట పాలకుడుగా ఉన్న విజయనగర సేనాని రేచెర్ల రామలింగ నాయుడు (కొన్ని సంఘటనల అనతరం ) నీటి బుగ్గలున్న ప్రాంతం లో ఉన్న శివలింగాన్ని గుర్తించి ఆలయాన్ని నిర్మించాడు నీటి బుగ్గ ఉన్న ప్రాంతం లో ఉండటం చేతశివుణ్ణి బుగ్గ రామలింగేశ్వరుడు పిలువటం వాడుక అయినది .ఈ ఆలయం కూడా ముస్లిం పాలక సైన్యాల దోపిడీకి గురియై ప్రభావాన్ని కోల్పోగా 1800 సం. రం లో ఈ ప్రాంత కలెక్టర్ థామస్ మన్రో ప్రోత్సాహంతో ఆలయ పునఃరుద్దరణ ,పూజాదికాలు ప్రారంభం అయినట్లు తెలుస్తుంది.
ఇది పెన్నా నది పడమటి తీరం లో ఉన్నది . ఆలయానికి శిధిలమైన మూడు ప్రాకార గోపురాలు ఉన్నాయి . శిధిల బాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపల బాగం లో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి .ప్రధాన ద్వారం నుండి లోపలి వెళ్ళేప్పుడు లోపలి కుడి ప్రక్కన గోపురం లో బాగం గానే వినాయకుడికి చిన్నపాటి మందిరం ఉంటుంది . ఇక్కడ ఆలయ ప్రాంగణం లో శివాలయం తో పాటు మరో రెండు దేవాలయాలు కోదండ రామ స్వామి ఆలయం ప్రధాన గోపురానికి ఎదురుగా దక్షిణ ముఖ ద్వారం తో ఉంటె , రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం పడమటి దిశ ముఖద్వారం కలిగిఉన్నది . వీరబద్ర స్వామికి మరో చిన్న ఆలయం కూడా ఉంది .
![]() |
| ఉత్తర (వెనుక ) ద్వారం |
![]() |
| గోపురం పై ఉన్న అందమైన శిల్పం |
తెలంగాణ లో ఇదే " బుగ్గ రామలింగేశ్వర స్వామి " పేరుతొ వికారాబాద్ దగ్గరలో వేరొక ఆలయం ఉన్నది .
![]() |
| ప్రధాన గోపుర ద్వారం పై అందమైన నటరాజస్వామి |
ఆ రోజు ఆదివారము , అడపా దడపా భక్తులు వచ్చి వెళుతున్నారు . మాకు దర్శనం 15 నిముషాల్లోనే అయిపొయింది . శివలింగానికి యోని పిటం లేదు . ఆలయ ప్రాంగణం లో వెనుక గోపురానికి ఎదురుగా ఉన్న మండపం లో శివలింగం ఉన్నది . కొంతమంది భక్తులు శివునికి నీళ్ళ తో అభిషేకం చేస్తున్నారు .
![]() |
| రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం |
ఇక్కడ కు రావటానికి ముందు చింతల వెంకట రమణుడి ఆలయానికి వెళ్ళేము . ఇది కూడా బుగ్గ రామలింగెశ్వర ఆలయం తో పాటు నిర్మిత మైనది. ఇక్కడి శ్రీనివాసుడికి చింతల వెంకట రమణుడు అనే పేరు ఎలా వచ్చింది అని అక్కడి వారిని అడిగితే " చింతలు తీర్చే దైవమని ,పూర్వం చింత చెట్ల వనాలు ఉండేవని ," అనే భిన్న కారణాలు వారు చెప్పారు .
ఈ ఆలయం తూర్పు దిశగా ఉన్నది . వెంకట రమణుడి ప్రధాన ఆలయానికి ప్రక్కనే లక్ష్మి దేవి "ఆనందవల్లి అమ్మవారు" గా చిన్న ఆలయం లో కొలువై ఉన్నది .
![]() |
| వెంకట రమణుడి ఆలయం |
ఈ ఆలయం తూర్పు దిశగా ఉన్నది . వెంకట రమణుడి ప్రధాన ఆలయానికి ప్రక్కనే లక్ష్మి దేవి "ఆనందవల్లి అమ్మవారు" గా చిన్న ఆలయం లో కొలువై ఉన్నది .
వెంకట రమణుడి ఆలయం
తాడిపత్రి కి చేరటానికి మార్గాలు:-
చెన్నై-రేణిగుంట -గుత్తి (Gooty ) రైలు మార్గం లో తాడిపత్రి రైల్వే స్టేషన్ ఉన్నది దేశం లో చాలా ప్రాంతాల నుండి ఇక్కడకు రైలు ప్రయాణ సౌకర్యమున్నది. దగ్గరలో ఉన్న అనంతపురం, కడప ల నుండి రాష్ట్ర ప్రభుత్వ bus ల ద్వారా లేదా taxi ల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు . తాడి పత్రీ చిన్నస్థాయి పట్నం ఇక్కడ పరిమితి సౌకర్యాలతో వసతి గల గెస్ట్ హౌస్ ఉన్నాయి . దగ్గరలో ఉన్న రేణిగుంట విమానా శ్రయం 240 కిలోమీటర్లలో ఉన్నది.
తాడిపత్రికి దగ్గరలో ఉన్న సందర్శనీయ ప్రదేశాలు :-
యాగంటి:-ఇది కూడా ప్రముఖ శైవక్షేత్రం 73 కిలోమీటర్ల దూరంలో ఉన్నది
యాగంటి:-ఇది కూడా ప్రముఖ శైవక్షేత్రం 73 కిలోమీటర్ల దూరంలో ఉన్నది
బేలుం గుహలు:- దేశం లోనే పెద్ద గుహలలో 2వ స్థానం లోఉన్నాయి . యాగంటికి వెళ్ళే మార్గంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి .
ఆలూరు కోన :-శ్రీ రంగనాథ స్వామి ఆలయం పెన్నా నదికి ఆవలి వైపున 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)















