13, ఏప్రిల్ 2016, బుధవారం

కుంభ మేళా జరిగే మూడు మూర్తుల త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం , నాసిక్

 మూడుమూర్తుల త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, 

త్రయంబక్ ,మహారాష్ట్ర 

             
                                  ప్రముఖ పారిశ్రామిక నగరం నాసిక్  కు 28 కిలోమీటర్ల దూరం లో మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల  బ్రహ్మగిరుల్లో త్రయంబక్ గ్రామం లో ఈ జ్యోతిర్లింగం ఉన్నది. ఆలయం నల్ల రాతితో కట్టబడినది  స్వయంభువుగా వెలసిన ఈ జ్యోతిర్లింగం లో (yoni pitam  మధ్యన  గుంట లో మూడు లింగ స్వరూపాలు)మూడు ముఖాలు (బ్రహ్మ,విష్ణు,మహేశ్వరుడు) అగుపించటం ఇక్కడి ప్రత్యేకత. ఈ మొత్తం శివలింగానికి అలంకరించిన వజ్రఖచిత కిరీటం పాండవుల కాలం నాటిదని ప్రతీతి. దిన్ని ప్రతి సోమవారం యాత్రికులు సాయం వేళ చూడవచ్చు. ప్రధాన ఆలయానికి ఎదురుగా నందీశ్వరుని మందిరం ఉన్నది. గర్భాలయం లోనికి ఇప్పటి వరకు పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్నది . మహిళల పట్ల ఈ విషయం లో వివక్ష చూపటం ఈ మద్య బాగా వివాద మగుట చేత 03. 04. 2016 తేదిన "పురుషులకు కూడా గర్బాలయ ప్రవేశాన్ని " నిష్షేదిస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి . 

                         
                 ఉజ్జయిని, త్రయంబకేశ్వరం, జ్యోతిర్లింగాలు కల్గిన ఈ క్షేత్రాల్లో మాత్రమే కుంభ మేళా ఉత్సవాలు జరుగుతాయి. గౌతమ మహర్షి  కి మహా శివుడు ఇచ్చిన వరం పలితంగా గంగ ఇక్కడ గోదావరి గా ఉద్బవించింది. కాలసర్ప దోష నివారణ పూజలు ఇక్కడ జరుపుతారు. ఇక్కడ కుశావర్త పుష్కరిణి ఉన్నది  ఇందులోకి నీరు ఎలావస్తుందో తెలియనప్పటికీ   గోదావరి నది జలాలు గానే అందరు భావిస్తారు   ఈ పుష్కరిణి చుట్టూ పలు శివాలయాలు, ఇతర దేవాలయాలు  కూడా  ఉన్నాయి.


                                   
              త్రయంబక్ నాసిక్ నగరానికి 28 కిలోమీటర్ల దూరం లో ఉన్నది. నాసిక్ నుండి  ఇక్కడకు చక్కని రోడ్ ప్రయాణ సౌకర్యాలున్నాయి. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్కు / ద్వారా దేశం లోని ప్రధానమైన స్టేషన్ ల నుండి రైళ్ళు నడుస్తున్నాయి. నాసిక్ లో డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ ఉన్నది. 

Note:-13-04-2016 నుండి పురుషుల  గర్బాలయ దర్శనం పై ఉన్న నిషేదాన్ని తొలగించినట్లు ఈనాడు దినపత్రికలో వార్త ప్రచురించ బడినది 


కామెంట్‌లు లేవు: