23, ఏప్రిల్ 2016, శనివారం

వారణాశి- పురాతన జ్యోతిర్లింగ లింగ క్షేత్రం

                                  


                                ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో గంగా నది పశ్చిమ తీరం లో ఉన్న భూభాగానికి ఉత్తర దక్షిణ దిశల్లో వరుణ , అశి  అనే చిన్న నదులు గంగా నదిలో కలుస్తూ ఉండటం చేత వారణాశి అని బెనారస్ ('వ' కారం 'బ' కారం గా మారి ) అని సంక్షిప్తం గా  కాశి  అని కూడా పిలుస్తారు ) ఇది  అతి  పురాతన జ్యోతిర్లింగ లింగ  క్షేత్రం  . ఈ క్షేత్రం లో  పరమేశ్వరుణ్ణి కాశి విశ్వేశ్వరుడు గాను లేదా కాశి విశ్వనాథుడు గాను, పార్వతి దేవిని విశాలాక్షి  గాను  కొలుస్తుంటారు . చరిత్రలో ఈ ఆలయం పలుమార్లు ముస్లిం దండ యాత్రల్లో నాశనమై , మరల పునఃనిర్మితమైనది . ఆ క్రమం లో 1780 సంవత్సరం లో ఇండోర్ పాలకురాలు  రాణి అహల్యాబాయి హోల్కర్ చేత పునఃరుద్దరణ కావించబడినది .  మీరా ఘాట్ లో విశాలాక్షి దేవాలయం అష్టా దశ శక్తి పితాల్లో ఒకటి , కాశి లో గల నవ గౌరీ లలో ఈ ఆలయం ఒకటి 

కామెంట్‌లు లేవు: