19, ఏప్రిల్ 2016, మంగళవారం

కోల్ కట ,వెస్ట్ బెంగాల్

Some of Visiting Places in Kolkata


కాళీ ఆలయం , దక్షిణేశ్వర్ : హౌరా స్టేషన్ కు 11 కిలోమీటర్ల దూరాన హుగ్లీ నది తూర్పు తీరం  లో ఉన్నది  స్వామి వివేకానంద గురువర్యులు రామ కృష్ణ పరమహంస  పౌరోహిత్యం నిర్వహించిన ఆలయం ఇదే . 
సందర్శన సమయాలు : 
ఉదయం 6:00నుండి మద్యాహ్నం 12:30వరకు         సాయంత్రం 3:30నుండి రాత్రి 8:30 వరకు 
దక్షిణే శ్వర్ టెంపుల్

విక్టోరియా మెమోరియల్ హాల్,ఆలిపూర్  : 1901 సంవత్సరం లో మరణించిన బ్రిటిష్ రాణి జ్ఞాపకార్థం  అప్పటికి  రాజధాని గా ఉన్న ఈ నగరం లో  భవనాన్ని నిర్మించడం జరిగినది . విశాలమైన గార్డెన్ గలిగిన ఈ భవనం ప్రస్తుతం ఒక మ్యూజియం  ఇందులో పలురకాలైన గ్యాలరీలు ఉన్నాయి . హౌరా రైల్వే స్టేషన్ కు 8 కిలోమీటర్ల దూరం లో ఉన్నది . 

కాళీ ఘాట్ కాళీ ఆలయం,ఆలిపూర్ :-18 శతాబ్దం లో నిర్మిచబడిన ఆలయం , 51 శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పబడుతుంది . ఇది కలకత్తా నగరం లో సుప్రసిద్ద ఆలయం . హౌరా రైల్వే స్టేషన్ నుండి విక్టోరియా మెమోరియల్ హాల్ మీదుగా కు 12 కిలోమీటర్ల దూరంలో(విక్టోరియా మెమోరియల్ హాల్ కు  4 కిలోమీటర్ల దూరం ) ఉన్నది . 
 సందర్శన సమయాలు : ఉదయం 9:00నుండి         సాయంత్రం 4:00నుండి 
బేలూర్ మఠం:- ఇది స్వామి వివేకానంద  రామకృష్ణ మిషన్  సంస్థ కు ప్రధాన కేంద్రం  . 40 ఎకరాల్లో విస్తరించి ఉన్నది . ఇది దక్షిణే శ్వర్  కాళీ టెంపుల్ మార్గం లో హౌరా రైల్వయ స్టేషన్ కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది . 
బేలూరు మఠం లోని ఆలయం 

సెయింట్ జాన్'స్ చర్చ్:-ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో నిర్మించారు . దేశం లో ఉన్న పురాతన చర్చ్ లలో ఇది ఒకటి . 200 సంవత్సరాలకు పైబడిన చరిత్రకు సాక్ష్యమైన ఈ చర్చ్  క్రికెట్ గ్రౌండ్ "ఈడెన్ గార్డెన్" కు సమీపంలోనే హుగ్లీ నది తీరంలో ఉన్నది .ఒకప్పుడు ఇది Cathedral గా కూడా వ్యవహరించబడినది .   


కామెంట్‌లు లేవు: