కన్యాకుమారి క్షేత్రం -పర్యాటక కేంద్రం
భారత దేశపు దక్షిణపు కొసన ఉన్నది "కన్యాకుమారి " క్షేత్రం , ఇది తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ఉన్నది (Head Quarter మాత్రం నాగర్ కోయిల్ ).ఇది బంగాళా ఖాతం , హిందూ మహా సముద్రం ,అరేబియా మహా సముద్రాల సంగమ ప్రాంతం.సూర్యోదయం ,సూర్యాస్తమయం రెండు సముద్రంలోనే గమనించవచ్చు . దీనిని"కన్యాకుమారి అగ్రము" అనే పేరున్నది . చక్కని బీచ్ లు ఉన్నాయిక్కడ .ఇది ప్రముఖ పుణ్య క్షేత్రమే కాక పర్యాటక కేంద్రం కుడా .
![]() |
| Kanya Kumari Amman |
కన్యాకుమారి /భగవతి అమ్మన్ ఆలయం :-- కుమారి అమ్మన్ గా పేరొందిన కన్య కుమారిని ఇక్కడ పార్వతి దేవి అవతారం గా ఇక్కడ భావిస్తారు. భాణాసుర సంహరార్థం పార్వతీదేవి ఇక్కడ బాలిక గా వచ్చి , తపమాచరించి , అసుర సంహారం కావించి కుమారి అమ్మన్ గా ఇక్కడ అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. .కురుక్షేత్ర యుద్ధం లో పాల్గొనటానికి ఇష్టపడని బలరాముడు చేసిన తీర్ధ యాత్ర లో బాగం గా ఈ ఆలయాన్నిదర్శిం చాడని ఇక్కడివారు చెబుతారు .
వివేకానంద రాక్ మెమోరియల్(వివేకానంద పురం):- 1892 సంవత్సరంలో USA చికాగో సభలకు వెళ్ళటానికి ముందు స్వామి వివేకానంద 3 రోజులపాటు ఇక్కడ ధ్యానం చేసారు. కన్యాకుమారి తీరానికి 500 మీటర్ల దూరంలో 4 ఎకరాలు వైశాల్యం ఉన్న కొండపై 12 అడుగుల ఎత్తైన వివేకానందుని కాంస్య విగ్రహం ప్రతిష్టించారు . ఇక్కడకు ఫెర్రీ సౌకర్యం ఉన్నది .
తిరువళ్ళువార్ విగ్రహం:- సుప్రసిద్ద తమిళ తత్వవేత్త, కవి అయిన తిరువళ్ళువార్ యొక్క 133 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని తమిళనాడు ప్రభుత్వం 2000 సంవత్సరం లో వివేకానంద రాక్ మెమోరియల్ కు 200-300 అడుగుల దూరంలో ఉన్న మరో చిన్న గుట్ట (కొండ) పై ప్రతిష్టించించారు .
![]() |
| Gandhiji Memorial Hall |
మహాత్మా గాంధి స్మారక మందిరం:-1954సంవత్సరం లో ఈ స్మారక మందిరాన్ని నిర్మించి మహాత్మా గాంధీ అస్థికలు ఉన్న కలశాన్ని ఇక్కడ ఉంచారు .
సుచీంద్రం:- నగర్ కోయిల్ నుండి కన్యాకుమారి వెళ్ళే మార్గంలో కన్యాకుమారి కి 13,నాగర్ కోయిల్ కు 8 కిలోమీటర్ల దూరం లో ఉన్నది . ధను మలయన్ ఆలయం ఇక్కడ ఉన్నది .
కాశ్మీర్ తో సహా దేశం లోని అన్నిప్రాంతాలనుండి కన్యాకుమారి క్షేత్రానికి రైళ్ళు నడుస్తున్నాయి . రాజధాని చెన్నై కి 700 కిలోమీటర్ల దూరం లో ఉన్నపటికీ , చెన్నై తో సహా రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలనుండి బస్సు లు నడుస్తున్నాయి . ఇక్కడ కేరళ రాజధాని తిరువనంతపురం 90 కిలో మీటర్ల దూరంలోనే ఉన్నది .మధురై కు తిరునల్వేలి మీదుగా 245 కిలోమీటర్ల దూరంలో ఉన్నది .తిరువనంతపురం మదురై లలో కూడా విమానాశ్రయాలు ఉన్నవి .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి