1, మార్చి 2016, మంగళవారం

చిదంబర రహస్యం అంటే ...............

Thillai Nataraja Temple, Chidambaram 



                                         ప్రాచీన కాలంలో తిల్లై వనం లో ఉండటం చేత  తిల్లై నటరాజ ఆలయం గా పేరుగాంచినది . ఈ చిదంబరం పుణ్యక్షేత్రం చెన్నై నగరానికి దక్షిణ దిశ లో  235 కిలో మీటర్ల  దూరంలో  కడలూరు జిల్లా నందు  ఉన్నది.  చిత్ అనగా చైతన్యం , అంబరం అనగా ఆకాశం, చిదంబరం   అంటే ఆకాశం నుండి పుట్టిన చైతన్యం అని అర్ధం . ఇక్కడ ఉన్నది పంచ భూత లింగాలలో ఒకటైన  ఆకాశ లింగం కనుక ఆ ప్రదేశానికి "చిదంబరం " అనే పేరు వచ్చింది . ఇక్కడ శివుడు ఎక్కడా లేని విధం గా నటరాజ స్వామి గా  (హిందూ మతానికి చెందిన  ప్రతిమ గా ప్రపంచ వ్యాప్తంగా ఇతర మతాలలో  గుర్తింపు పొందిన )ఆనంద తాండవ భంగిమ  లోను,  లింగ రూపం లోను రెండు విధాలుగా దర్శన మిస్తాడు . 


                                                 పార్వతి దేవి  శివకామి అమ్మాళ్ గా పూజింపబడుచున్నది.నటరాజ స్వామి   పక్కనే  "చిదంబర  రహస్యం " తెర చాటున ఉంటుంది .  చిదంబర  రహస్యం   అంటే   ఆ ప్రదేశం లో శివ    పార్వతులు ( అందరికి కాక జ్ఞానులైన  వారికీ  మాత్రమే)  కనిపించేవారని  చెబుతారు . ప్రత్యెక      మైన  పుజసమయంలో  తెరను తొలగించి కొద్ది  సేపు  భక్తులకు  చూడటానికి  అవకాశం కల్పిస్తారు  (తెరను  "మాయ " కు ప్రతిరూపం గా మనం  భావించుకోవచ్చు .మాయ పొరలు  పోయిన  వారికి  అక్కడ శివ సాక్షాత్కారం లభిస్తుందన్నమాట ) చీకటి గా ఉండే ఆ ప్రాంతంలో వారి వారి మనస్సుకు  తోచినది చూడవచ్చు ,ఊహించు కోవచ్చు . నటరాజ స్వామి  మూర్తి కి ,ఆలయ నిర్మాణానికి  ( మానవ జీవితానికి అన్వయిస్తూ )  పోలికలు  ప్రచారం  లో ఉన్నవి   

                                              షుమారు  50  ఎకరాల్లో  విస్తరించిన  ఆలయ  ప్రాంగణంకు  నలు వైపులా నాలుగు ( షుమారు 40 మీటర్ల  ఎత్తైన ) గోపురాలు  ఉంటాయి  ఇక్కడ ప్రాగణం లో శివ గంగ పుష్కరిణి /కోనేరు, సుబ్రహ్మణ్యేశ్వరునికి ,  వినాయకుడికి  ఆలయాలున్నాయి.

                                     ఇక్కడే గోవిందరాజపెరుమాళ్,పుండరీకవల్లీ అమ్మవార్ల ఆలయం ఉన్నది.108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఇది ఒకటి.చిదంబరం  క్షేత్ర పరిది లో అనేక తీర్ధాలు ఇతర ఆలయాలు ఉన్నాయి . చిదంబరం చేరుటకు మార్గాలు : చెన్నైఎగ్మూర్ నుండి  చిదంబరం మీదుగా పెక్కు రైళ్ళు నడుస్తున్నాయి . తమిళనాడు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలనుండి ప్రభుత్వ /ప్రైవేటు ఆపరేటర్లు  చిదంబరం కు బస్సులు నడుపుచున్నారు . దగ్గర లో ఉన్న విమానాశ్రయం చెన్నై లో ఉన్నది .  

సమీపంలో ఉన్నకొన్నిదర్శనీయ ప్రదేశాలు 

కడలూరు:- 44 కిలోమీటర్ల దూరంలోచరిత్ర ప్రసిద్ది చెందిన  కడలీశ్వర,వరదరాజ పెరుమాళ్  దేవాలయాలున్నాయి . 

వైదేస్వరం(Vaitheeswarankovil ) :- 26 కిలోమీటర్ల దూరంలో వైదేశ్వర దేవాలయమున్నది .  



భువనగిరి:-మంత్రాలయ రాఘవేంద్ర స్వామి జన్మించిన గ్రామం . చిదంబరం కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది .

పిచావరం (pichavaram) :-మడ అడవులు ఉన్న విహార ప్రదేశం 15 కిలోమీటర్ల దూరంలో బంగాళా ఖాతం సముద్ర తీరం లో ఉన్నది . ఇది విహార కేంద్రం 


సిర్కాళి (Sirkazhi) :-21 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ బ్రహ్మపురిశ్వర ఆలయం ఉన్నది

కామెంట్‌లు లేవు: