5, మార్చి 2016, శనివారం

"చార్ దామ్" యాత్ర లో రామేశ్వర క్షేత్ర దర్శనం

           శ్రీ రాముడు అర్చించిన జ్యోతిర్లింగం-రామేశ్వరం                                                                            

రామనాధ స్వామి దేవ స్థానం
                                           ఆది శంకరాచార్యులు  చెప్పిన "చార్ దామ్" యాత్ర లో రామేశ్వర క్షేత్ర దర్శనం  ఒకటి . మిగిలిన మూడు ద్వారక ,బదరీనాథ్ ,పూరి క్షేత్రాలు . తమిళ నాడు రాష్ట్రం, రామనాథ పురం జిల్లా లో  ఆగ్నేయ దిశన  బంగాళ ఖాతం లో చిన్న ద్వీపం గా ఉన్నది . రాజధాని చెన్నై నగరానికి 560 కిలో మీటర్ల దూరంలో ఉన్నది . కాశీ యాత్ర వారణాశి లోని విశ్వేశ్వ రుని దర్శనం తో పూర్తి కాదని , గంగా జలాన్ని రామేశ్వరం వద్ద సాగరం లో కలిపి రామనాథుని దర్శనంతోనే పూర్తి అవుతుందని చాలామంది ఆద్యాత్మిక వేత్తల  విశ్వాసం . 

                                         త్రేతాయుగం లో శ్రీ రామ చంద్రుడు ఇక్కడినుండే సముద్రంపై వారథి ని (రామేశ్వర దేవాలయానికి 20కిలోమీటర్ల దూరం లో ధనుక్ష్కోటి వద్ద ) నిర్మింఛి లంక లో ప్రవేశించి  రావణ సంహారం కావించిన అనంతరం  బ్రహ్మ హత్య పాప నివారణా పరిహారార్ధం ఇక్కడే  రామేశ్వర ద్వీపం లో లింగ ప్రతిష్ట కావించాడు . అందుచేత ఈ క్షేత్రం లో   పరమేశ్వరుడు  ఇక్కడ "రామనాధుడు" గా పూజింపబడుచున్నాడు . 12 జ్యోతిర్లింగాలలో ఒకటి . అత్యద్బుత శిల్పకళా చాతుర్యం నిర్మించ బడిన ఈ ఆలయం దేశం లోని పెద్ద దేవాలయాలలో ఒకటి . ఇక్కడ ఆలయంలో రెండు లింగాలు ఉన్నాయి అందులో ఒకటి ఆదిశంకరా చార్యులు వారు ప్రతిష్టించిన స్పటిక లింగంఒకటి . ప్రాతః కాల వేళలో కొద్దిసేపు మాత్రమే ఈ స్పటిక లింగ దర్శనం ఉంటుంది . 

                     ఆలయ ప్రాంగణం లో 22(బావులు ) పవిత్ర  తీర్థాలున్నాయి . "ఈ తీర్థాలలోస్నానామాచరించటం" అనేది రామనాధలింగదర్శన లో ప్రధానమైన కార్యక్రమం .    గందమాదన పర్వతం ( 2కిలోమీటర్ల దూరంలో చిన్న కొండ ) లక్ష్మణ తీర్థం ( 2కిలోమీటర్ల దూరంలో),సాక్షి ఆంజనేయ స్వామి ఆలయం ( అక్కడ ఉండే రామ సేతువు కు వాడిన రాళ్ళూ నీటిలో తేలుతాయి ) జడ తీర్థం కోదండ రామాలయం (విభీ షు ణు ని కి పట్టాభిషేకం జరిగిన ప్రాంతం మొదలైనవి కొన్ని ముఖ్యమైన దర్శనీయ ప్రదేశాలు  , మన మాజీ రాష్ట్రపతి ,అంతరక్ష  శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారి జన్మ స్థలం ఇదే . ఆలయానికి దగ్గరలోనే ఆయన నివసించిన  భవనం ఉన్నది . 
 
                                       Main Land లో  ప్రముఖ పుణ్య క్షేత్రం మీనాక్షి సుందరే శ్వరుల క్షేత్రం మధురై కు ఇది  170 కిలోమీటర్ల దూరంలో ఉన్నది .యిక్కడే  విమానాశ్రయం కుడా ఉన్నది . దేశం లోని అన్ని ప్రాంతాలనుండి ఇక్కడకు రైళ్ళు నడుస్తున్నాయి . తమిళనాడు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలనుండి ప్రైవేటు /రాష్ట్ర ప్రభుత్వ బస్సులు నడుస్తున్నాయి .

కామెంట్‌లు లేవు: