నాగేశ్వర జ్యోతిర్లింగం ,దారుకావనం ,గుజరాత్
ఇతిహాసాల్లో ద్వయితవనం పిలువబడిన దారుకావనం లో 10 వ జ్యోతిర్లింగం ఉన్నది . ఇది గుజరాత్ నందు జామ్ నగర్ నుండి ద్వారక పుణ్య క్షేత్రం (132 కిలోమీటర్లు ) మీదుగా వెళ్ళే దారిలో 148 కిలో మీటర్ల దూరం లో ఉన్నది . ఇక్కడ మహా శివుణ్ణి నాగనాధ్ , నాగేశ్వర మహాదేవ్ గాను పార్వతి నాగేశ్వరి గాను పూజింప బడుచున్నారు .
ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం దర్శనం ద్వారక -బెట్ ద్వారక యాత్ర
లో (30-40 కిలోమీటర్ల పరిధిలో )అంతర్బాగం గానే బావించవచ్చు. ఇక్కడి కృష్ణుని ఆలయాలు, శంకరాచార్యులు వారు స్తాపించిన శారదాపీఠం ఇక్కడ ఉన్నాయి .
రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ నుండి ఇతర ప్రధాన నగరాల నుండి ద్వారక మీదుగా ఇక్కడకు road connectivity బాగా ఉన్నది . దేశం లోని ప్రముఖ నగరాలనుండి ద్వారక మీదుగా ఒఖా వరకు రైళ్ళు నడుస్తున్నాయి ఇక్కడకు దగ్గరలో ఉన్నరైల్వే స్టేషన్ "ద్వారక ", దగ్గరలో ఉన్నవిమానాశ్రయం జామ్ నగర్ .


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి