తెలంగాణారాష్ట్రం వరంగల్ జిల్లాలో జిల్లాకేంద్రం వరంగల్ నగరానికి
75kmదూరంలో పాలంపేట గ్రామ పరిదిలో అత్యంత అద్భుత శిల్ప నైపుణ్యంతో 12 శతాబ్దంలో కాకతీయ సేనాని రేచెర్ల రుద్రయ్య చేత నిర్మించబడినది . ఇది హైదరాబాద్ నగరానికి 200కిలో మీటర్ల దూరంలో ఉన్నది . ఈ ఆలయం కాకతీయులు ప్రత్యెక శైలిలో (sand box technology ) నిర్మించారు ఇది ఎత్తైనపీఠం పై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది.
వ్యవహరిస్తారు. దగ్గరలోనే తటాకం ఉన్నది.ఆ చెరువు,ఈ దేవాలయం రెండూ శిల్పిరామప్ప పేరుతోనే పిలువబడటం ఆ శిల్పినైపుణ్యానికి దక్కిన గౌరవంగా భావించవచ్చు.
నిర్మాణంలోఅత్యంత తేలికైన ఇటుకలని కూడావాడటం జరిగినది ఇవి నీటిమీద తేలే స్వభావం కలిగినవి. ఆలయప్రాంగణంలో ప్రధానఆలయంతోపాటు ఉపాలయాలున్నాయి. ఇవి అన్ని విదేశియులను కూడా అబ్బురపరిచేశిల్పకళా సౌందర్యాన్ని ప్రదర్శించేవె.
ఆలయప్రాంగణంలో నందిముందు మనం ఏప్రక్కన నిలబడినా నిక్కపొడుచుకున్న పలుచని చెవులతో మనవైపు చూస్తున్నట్లే ఉంటుంది.
ఈ దేవాలయం మహ్మదీయ సుల్తానుల
దాడులకు ఇంకా మరెన్నో ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుంటూ శిధిలవస్తకు చేరుకున్నది. నవీన
మానవుడి జీవితంలో వేగం పెరిగినట్లే ప్రస్తుతం దేవాలయం క్షీణత లో కూడా వేగం
పెరిగింది.
రామప్ప గుడికి రావటానికి మార్గాలు :- ప్రత్యక్షం గా పాలంపేట కు railway connectivity లేదు కానీ పేరొందిన tourist place కావటం చేత హైదరాబాద్ నుండి, వరంగల్ నుండి రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి. 75 కిలోమీటర్ల పరిధిలో వరంగల్ ,కాజిపేట రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. ఈ స్టేషన్ నుండి పెద్దపల్లి వెళ్ళే రైలు మార్గంలో మరో రైల్వే స్టేషన్ జమ్మికుంట (JMKT ) 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

రామప్ప గుడికి దగ్గరలో దర్శనీయ ప్రదేశాలు :- రామప్పగుడికి ఒక వైపున 30కిలోమీటర్ల దూరంలో లక్నవరం చెరువు (Laknavaram Lake ) చూడతగిన ప్రదేశం. మరొక వైపున 16కిలోమీటర్ల దూరంలో రేగొండ మండలం రావులపల్లె గ్రామం వద్ద చూడదగిన ప్రాంతం పాండవులు వనవాసం చేశారని చెబుతున్న పాండవుల గుహలు ఉన్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి