8, ఫిబ్రవరి 2016, సోమవారం

ఆహా బలం -అహోబిలం

నవ నరసింహ క్షేత్రం -అహోబిలం 

             
                                     కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ శిల్పకళ నిష్ట్నాతులు లకు ప్రసిద్ది. ఆళ్లగడ్డకు తూర్పున నల్లమల అరణ్యాలలో 26 కిలో మీటర్ల దూరంలో సముద్ర మట్టానికిషుమారు 3000 అడుగుల ఎత్తున ప్రకృతి రమణీయమైన తూర్పుకనుమల్లో అహోబిల నారసింహుడు కొలువైయున్నాడు.  ఇచ్చట భవనాశని నది ప్రవహిస్తుంది దిగువ ఆహోబిలం నందు శ్రీ లక్ష్మినరసింహస్వామిదేవాలయం ఉన్నది.  ఇక్కడ నుండి పైన ఉన్న ఎగువ ఆహోబిలం లో గల  నరసింహస్వామి దేవాలయానికి మద్యదూరం 8 కిలోమీటర్లు. దిగువ ఆహోబిలాన్నిమినహాయించి ఎగువ అహోబిలం నందు 9 నరసింహక్షేత్రాలున్నాయి ,వీటిని నవ నారసింహ క్షేత్రాలంటారు అవి :-


1.భార్గవ నరసింహస్వామి :- పరశురాముడు తపమాచరించిన ప్రదేశం ఇక్కడ భార్గవ తీర్ధం ఉన్నది దిగువ అహోబిలం నుండి  2 KM దూరంలో ఉన్నది.
2.ఆహోబిలనరసింహస్వామి :- ఇక్కడ స్వామి ఉగ్ర నరసింహుడు స్వయంభవు ఎగువ అహోబిలం లో ప్రధాన దేవాలయం దిగువ ఆహోబిలనికి  8 KM దూరం. 
3.పావన(ప్రహ్లాద)నరసింహస్వామి :- జ్వాలనరసింహస్వామి దేవాలయానికి 2 KMదూరంలో అంటే ఎగువ ఆహోబిలనికి 6KM దూరంలో భవనాశని  తీరంలో గుడి ఉంది. 

     
4.చాత్రవట నరసింహస్వామి :-  ఇక్కడ రావిచెట్టు నీడన  వెలిసాడు దిగువ అహోబిలం నుండి  3 KM దూరంలో ఆలయం ఉన్నది.
5.జ్వాలా నరసింహస్వామి  :- ఎగువ అహో బిలానికి 4 km దూరంలో  దేవాలయం ఉన్నది . ఇక్కడ హిరణ్య కశిపుని సంహారం జరిగింది.
6.క్రోధకర (వరాహనరసింహస్వామి :- ఆహోబిలనికి 9కిలోమీటర్ల దూరంలో ఉందిఇక్కడ దేవాలయంలో మూర్తులుగా ఆంటే వరహస్వామిగా మరియు  ఉగ్రనరసింహస్వామిగా 
 దర్శనమిస్తాడు.


7.మాలోల నరసింహస్వామి :- ఎగువ ఆహోబిలనికి 2 KMపైన ఆలయం ఉన్నది. మాలోల అంటేలక్ష్మీదేవికి  ప్రియమైన అని అర్ధంనరసింహస్వామి లక్ష్మీదేవి  సమేతంగా  దర్శన మిస్తాడు.
8.కారంజ నరసింహస్వామి :-  ఎగువ అహోబిలం వెళ్ళే దారిలో దిగువ ఆహోబిలనికి 7 KM దూరంలో అంటే  ఎగువ ఆహోబిలనికి 1 KM దూరం లో   ఆలయం ఉంది. ఇక్కడ  ఆంజనేయుడు తపమాచరించు సమయంలో నరసింహస్వామిని విష్ణుమూర్తి అవతారం గా గుర్తించడానికి అంగీకరించక పోవతంచేత అతన్ని సంతృప్తి పరచటానికి చేతిలో ధనస్సుతో దర్శన మిస్తాడు . కారంజ వృక్షం క్రింద ఉండటం చేత స్వామిని ఇక్కడ  కారంజ నరసింహస్వామి గా కొలుస్తారు.
9.యోగానంద నరసింహస్వామి :- దిగువ ఆహోబిలనికి ఆగ్నేయ దిశగా 2 కిలో మీటర్ల దూరంలో ఉంది హిరణ్యకశిపుని సంహారనంతరం ఇక్కడ నరసింహ స్వామి ప్రహ్లాదునికి యోగకారక జ్ఞానాన్నిభోదించాడని  ప్రతీతి .  
ఉగ్రస్థంభం
         మొత్తం 10 దేవాలయాలు  16-17 కిలో మీటర్ల పరిధి లో ఉన్నాయి. రహదారులు అబివృద్ది  జరుగుతుంది.  అయిన   కాలినడక  ప్రయాణం  కూడా  చేయాల్సి  ఉంటుంది. ఇక్కడ మరికొన్ని దర్శనీయ క్షేత్రాలు ఉన్నాయి . అవి  ఉగ్రస్థంభం , స్థంభం అంటే  స్థంభం కాదు. భౌగోళికం గా చీలిన కొండ బాగం. ఎగువ అహోబిలానికి 8 KM  దీని శిఖరంలో ఒక కషాయవర్ణ పతాకంనరసింహస్వామి పాదముద్రలు ఉంటాయి. ఇక్కడే  నరసింహస్వామి ఉద్భవించాడని ప్రతీతి .ఇచ్చటకు  వెళ్ళటం అంటే  ఎంతో ప్రయాస కూడిన ప్రయత్నమే అవుతుందిప్రహ్లాదబడి (ప్రహ్లాదమెట్టు ) ఇది ఎగువ అహోబిలం నుండి ఉగ్రస్థంబానికి వెళ్ళే దారిలో ఉన్నది  ఇది అతి  చిన్న గుహ ఇందులో ప్రహ్లాదుని విగ్రహం  ప్రతిష్టించి  ఉంటుంది   దీని  చుట్టుప్రక్కల  చిన్నచిన్న  తీర్ధాలున్నాయి  అందులో 
రక్తకుండం ప్రధానం ఇందులో నీళ్ళు ఎరుపు వర్ణంలో ఉంటాయి. హిరణ్యకసుపుని సంహరించిన తరువాత నరసింహుడు ఇక్కడ తన చేతులు కడిగి నాడని విశ్వాసం. దిగువ అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామిదేవాలయంవైష్టవసంప్రదాయ వ్యాప్తికి కృషి చేయుచున్నప్రసిద్ధ  అహోబిలం 
మఠం ఉన్నాయి

ఇచ్చటకు వెళ్ళటానికి ఉన్న ప్రయాణ మార్గాలు :-
1. రేణిగుంటగుంతకల్ రైలు మార్గంలో ఉన్న కడప  నుండి  120 KM  దూరంలోను.
2. విజయవాడగుంతకల్ రైలు మార్గంలో  ఉన్న  నంద్యాల  నుండి 65 KM దూరంలోను అహోబిలం  ఉన్నది.   పై   రెండు  ప్రాంతాలనుండి వయా (via  ) ఆళ్ళగడ్డ - Bus / car సౌకర్యం కలదు.(కడప ,నంద్యాల ఈ రెండు చిత్తూరు -కర్నూలు  18నెంబరు జాతీయ రహదారిపై ఉన్నాయి . 
3. హైదరాబాద్:-  కాచిగూడ-గుత్తి-బెంగుళూరు రైలు మార్గంలో గుత్తి  (Gooty) రైల్వే స్టేషన్ నుండి via   యాగంటిబనగానపల్లిఆళ్ళగడ్డ  మీదుగా Bus /car ప్రయాణ మార్గమున్నది. 
 దగ్గరలో దర్శనీయ ప్రదేశాలు :-
1. మహానంది :-నంద్యాల  కు 17 KM దూరంలో ఉన్న సుప్రసిద్ద శైవ క్షేత్రం
2. యాగంటి :- ఆళ్ళగడ్డ  కు (వయబనగాన పల్లె - 65 KM  దూరంలో ఉన్న సుప్రసిద్ధ  శైవ క్షేత్రం.
3. బనగానపల్లె :- బ్రహ్మం గారి కాల జ్ఞానం భూస్ఠాపితం జరిగిన  గ్రామం

కామెంట్‌లు లేవు: