5, ఫిబ్రవరి 2016, శుక్రవారం

శ్రీ శైలం ప్రసిద్ద జ్యోతిర్లింగ క్షేత్రం

                                 నలమల అడవుల్లో సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో తూర్పు కనుమల్లో కొండల నడుమ (eastern ghats) శ్రీ పర్వతంగా పిలువబడే కొండపై కృష్ణా నది తీరం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా లో కర్నూలు నగరానికి 180 కిలోమీటర్ల దూరం లోఉన్నది భ్రమరాంబ మల్లికార్జునుల దివ్య క్షేత్రం. ఈ క్షేత్రంభూ మండలానికి ఇది నాభి కేంద్రం అని పండితులు చెబుతారు.12జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టా దశ శక్తీ పీఠాల్లొ(బ్రాహ్మణి శక్తి పీఠ ము)ఒకటి, ఈ రెండు ఇక్కడ ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఆలయ ప్రాంగణ మండపాలన్ని మనసును ఆకట్టుకునే శిల్పకళా శోభితమై ఉంటుంది .ఇక్ష్వాకులు ,పల్లవులు ,చాళుక్యులు , రెడ్డి ,కాకతీయ , విజయనగర మొదలైన సుప్రసిద్ద రాజ్య పాలకులందరూ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని వృద్ది చేసి తరించినవారే . ఈ క్రమం లో ఛత్రపతి శివాజి కూడా ఒకడు ఈయన ఆలయ ఉత్తర గోపురాన్ని నిర్మించాడు. ఈ క్షేత్రం గురించి హిందూ పురాణేతి హాసాలలో విశేషమైన ప్రస్తావనలున్నాయి .మల్లిఖార్జుని (ఒక భక్తురాలి కోరికపై మల్లెపూల దండ ధరించటం చేత శివుడి మల్లిఖార్జునుడు అయ్యాడు )ఆలయ ప్రాగణం లోనే భ్రమరాంబిక మాత(రాక్షస సంహారార్ధం పార్వతి దేవి ఇక్కడ బ్రమరం రూపం లో ఉద్బవించినది అని పురాణాల ఉవాచ ) ఆలయం ఉన్నది ఇక్కడ కృష్ణా నది ఉత్తరంగా ప్రవహిస్తుంది దీన్ని పాతాళగంగ అనిపిలుస్తారు .ఆలయం నుండి దిగువకు 1000 మెట్లు దిగితేగాని పాతళ గంగను చేరలేము , ఇందుకై roap way సౌకర్యం కూడా ఉన్నది .త్రేతా యుగం సీతా సమేతం గా రాముడు ,ద్వాపర యుగం లో పాండవులు ఈ క్షేత్రాన్నిదర్సించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరము లో సాక్షిగణపతి దేవాలయం,3 కిలోమీటర్ల దూరంలోపాలధార,పంచదార జలధారలు ఇక్కడ కొంతకాలం శంకరాచార్యులు వారు తపమాచరించారు, ఆ దగ్గరలోనే ఉన్నహటకేశ్వరంలోని శివాలయం. 8 కిలోమీటర్ల దూరం లో శ్రీ శైల శిఖర దర్శనం (మల్లిఖార్జున ఆలయశిఖర దర్శనం )చేసుకునే శిఖరేశ్వరం లోని వీరశంకరుని ఆలయం, మల్లిఖార్జున దేవాలయానికి 7 కిలోమీటర్ల దూరం లోని భీముడి కొలను, 13 కిలో మీటర్ల దూరంలోని శ్రీశైలం డాంకృష్ణా నదిలో ఎగువకుboat ప్రయాణం చేయాల్సిన అక్కమహాదేవి గుహలు (మహబూబ్ నగర్ జిల్లా) చూడవలసిన ప్రదేశాలు.                                          
                          శ్రీ శైలానికి  ప్రత్యక్షంగా రైలు ప్రయాణ సౌకర్యమైతే లేదుకాని , ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల్లోని ముఖ్య పట్నాల నుండి బస్సు ప్రయాణ సౌకర్యం ఉన్నది. రైలు ప్రయాణ మైతే   సికింద్రాబాద్ - కాచిగూడ - గుంతకల్ - గుత్తి  రైలు మార్గంలో కర్నూలు  స్టేషన్ ఉన్నది. శ్రీ శైలనికి 100 కిలో మీటర్ల 
పరిధిలో ఇంకా  విజయవాడ - గుంతకల్ రైలు మార్గంలో వినుకొండ,దొనకొండ,గజ్జలకొండ,మార్కాపురంరోడ్ అనే చిన్నపాటి స్టేషన్లు ఉన్నాయి. శైలానికి 360 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట, 200 KM  దూరంలో  హైదరాబాద్  విమానాశ్రయాలున్నాయి. 

కామెంట్‌లు లేవు: