4, ఫిబ్రవరి 2016, గురువారం

తెలుగు వారి కీర్తి పతాక వరంగల్ కోట

 

                              నేడు వరంగల్ గా పిలవబడుతున్న వోరుగల్లు ఒకనాడు భారతదేశం లో  పెరేనికగన్న కాకతీయ సామ్రాజ్య రాజధాని. కాకతీయ చక్రవర్తులలో ప్రముఖుడైన గణపతి దేవ చక్రవర్తి  12 వ శతాబ్ధం లో  ఈ  కోటను  కటించాడు .  రాణి  రుద్రమదేవి  పాలన కాలం లో ఈ కోట  మరింత  పటిష్టం  చేయబడినది . దేశం లోని అన్ని  ప్రాచీన కట్టడాలకు వలెనే  శిధిలమైపోయిన కోట ను మనం చూడవచ్చును .  శిల్పకళా చాతుర్యానికి మచ్చుతునక అయిన రామప్ప దేవాలయం  వరంగల్ జిల్లా లోనే ఇక్కడకు 70 KM దూరం లోనే ఉంది . తెలంగాణా రాష్ట్ర  రాజధాని  Hyderabad  కు వరంగల్ కోటకు మద్య  దూరం షుమారు 170 కిలో మీటర్లు . వరంగల్    విజయవాడ -ఖాజీ పేట రైలు మార్గంలో ఒక ప్రధాన మైన స్టేషన్ . 

కామెంట్‌లు లేవు: