4, ఫిబ్రవరి 2016, గురువారం

చంద్రగిరి శౌర్యానికి గీచిన గిరి

                                        
                               చిత్తూరు జిల్లా లో  చంద్ర గిరి కోట విజయనగర సామ్రాజ్యంలో  అతి ప్రదానమైనది.శ్రీ కృష్ణ దేవరాయలు  తిరుమల ను సందర్శించే సమయం లో ఈ కోట లో విడిది చేసే వారు .  విజయనగర సామ్రాజ్య కడపటి చక్రవర్తుల  రాజధాని కూడా  ఇదే . ముస్లిం పాలకుల దాడుల్లో కోట శిధిలం కాగా మిగిలిన రాజభవనం లో రాష్ట్ర ప్రభుత్వం మ్యుజియం ను ఏర్పాటు చేసింది .  అంతే కాక కోట ఔన్నత్యాన్ని తెలియచేయటానికి  సాయం వేళా  sound &light  show ని  కూడా  నిర్వహిస్తుంది .

                                చంద్రగిరి కి సమీపాన 52 కిలో మీటర్ల దూరం లో తలకోన జలపాతం ఉన్నది . ఈ జలపాతానికి వెళ్ళే మార్గం లోనే 5 కిలో మీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం లో విశేష ప్రాధాన్యమున్న  శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నది . 



                                ఇది  తిరుపతి నగరానికి  16 KM  దూరంలో చిత్తూరు  రోడ్ మార్గంలో ఉన్నది   రోడ్డు మార్గం  తప్పితే  చంద్రగిరి కి రైలు మార్గం లేదు .ధగ్గరలో ఉన్న చిత్తూరు , తిరుపతి  స్టేషన్ లు  దేశం లోని  ప్రధాన రైలు మార్గం లోనే   ఉన్నాయి .మన రాష్ట్రము లోనే కాక  Kerala  లో కూడ  మరో కోట  'చంద్రగిరి ' పేరు తో ఉన్నది .