శ్రీ కాళహస్తి ప్రముఖ శైవ క్షేత్రము -వాయు లింగ క్షేత్రము
శ్రీ కాళహస్తి పంచఋుుత లింగాములలో ఒకటైన వాయు లింగమున్న క్షేత్రము . శ్రీ కాళహస్తి చిత్తూరు జిల్లా లో స్వర్ణ ముఖీ నదీ తీరం ఉన్నది. బారత దేశం లో ఉన్న అతి పెద్ద దేవాలయములలో ఇది ఒకటి . శ్రీ కాళహస్తి నామానికి సంబందించి (శ్రీ అనగా సాలేపురుగు ,కాళ (ము )=సర్పము ,హస్తి =ఏనుగు , తిన్నడు /కన్నప్ప ) కధలు ప్రాచుర్యం లో ఉన్నాయి . ఇక్క పార్వతీ దేవి జ్ఞాన ప్రసూనాంభ గా కొలువై యున్నది . పల్లవులు ,చోళులు , విజయనగర చక్రవర్తులు ఈ ఆలయాన్ని విశేషం గా అబివృద్ధి చేసారు . ఆలయ ప్రాంగణం లో భూమి లోపల పాతాళ గణపతి ఆలయం ఉన్నది. శివుడు వసిష్ట మహర్షి కి ఇక్కడ పంచముఖ నాగలింగేశ్వరుడు గా దర్శనం ఇవ్వడం చేత సర్ప దోష నివారణ పూజలు , ఇక్కడ శివుడు నవగ్రహాలను కవచంగా ధరించడం చేత రాహు కేతు గ్రహ దోషశాంతి పూజలు ఇక్కడ జరుగుతాయి. మార్కండేయుడు మొదలైన పురాణ పురుషులు ప్రతిష్టిం చిన శివలింగాలు ఇక్కడ మండపాలలో దర్శనమిస్తాయి. ఆలయం లో మూకబిలం/పాతాళ గంగ ఉన్నది అక్కడ ఉన్న నీటి ని సేవిస్తే నత్తి పోతుందని ఇక్కడివారివిశ్వాసం. ఆలయానికి చేరి ఉన్న కొండపై కన్నప్ప గుడి ఉన్నది. మహాశివరాత్రి సమయంలో 12రోజులు పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీ కృష్ణ దేవరాయలు నిర్మించిన గాలిగోపురం 2010 సం ., లో కులిపోగా కొత్తగా మళ్ళి నిర్మించారు .


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి