31, జనవరి 2016, ఆదివారం

కొండవీడు- కొండపల్లి ఒకటి కాదు కానీ రెండూ చారిత్రాత్మక దుర్గాలే


                                                 నా చిన్నతనం కొండవీడు అనే పేరు చాలాసార్లు విన్నాను కానీ అది ఎక్కడ  ఉన్నదో తెలిసేది కాదు . ఈ మధ్యనే ఇంటర్నెట్ పుణ్యాన కొంత సమాచారం తెలిసింది కొండపల్లి, కొండవీడు ఈ రెండు గిరిదుర్గాలు చారిత్రాత్మకమైనవే.కొండపల్లికిల్లాగా ప్రసిద్ధమైనకొండపల్లి  కోట  కృష్ణా జిల్లా లో విజయవాడకు  షుమారు 25 కిలోమీటర్ల దూరం లో హైదరాబాద్ వెళ్ళే రోడ్ మార్గం లో ఉంటే , కొండవీడు కోట national highway 16 కు దగ్గరగా  గుంటూరు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో రాష్ట్రా రాజదానిగా develop ఔతున్న అమరావతి ప్రాంతానికి షుమారు 45 కిలోమీటర్ల దూరం లో  గుంటూరు జిల్లాలోనె  యడ్లపాడు మండలం  కొండవీడు గ్రామం లో ఉన్నది. గుంతకల్ -గుంటూరు -విజయవాడ  రైలు మార్గంలో ఫిరంగిపురం స్టేషన్ కు 4-5 కిలోమీటర్ల  దూరం  లోను ,విజయవాడ -చెన్నై మార్గంలో  బాపట్ల కు షుమారు 60 కిలోమీటర్ల దూరంలోను ఉంది  గుంటూరు జిల్లా లోని ఒక ప్రముఖ పట్టణం చిలకలూరి పేట కొండవీడు కు 30 km  దూరం లో ఉంది