31, జనవరి 2016, ఆదివారం

ఉదయగిరి కోట పరిసర అడవులు వనమూలికలకు ఆలవాలం

      ఉదయగిరి కోట -నెల్లూరు జిల్లా 

 పరిసర అడవులు వనమూలికలకు ఆలవాలం


    పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా లొ మండల కేంద్రం ఉదయగిరి .జిల్లా లో ప్రముఖ పర్యాటక కేంద్రం ఉదయగిరి  కోట విజయ నగర సామ్రాజ్యం లో  బాగం  అయ్యే నాటికే  ఇది  బలమైన గిరి  దుర్గం . తరువాత  మరింతగా అబివృద్ది చెందినది . కోట  పరిసర కొండలన్నీ వనమూలికలకు  ఔషద యుక్తమైన మొక్కలకు  ప్రసిద్ది  . అక్కడకొండల నుండి జాలువారే సెలయీటి నీరు కూడా ఆరోగ్య ప్రదమని అక్కడి ప్రజల నమ్మకం జిల్లా కేంద్రం నెల్లూరుకు 100 కిలోమీటర్ల  దూరం లోను మరో పట్నం కావలి  కి 80 కిలో మీటర్ల ఉంది . కానీ ఈ రెండు పట్నాల నుండి  ఉదయగిరికి రైలు మార్గం లేదు . రోడ్  మార్గమే శరణ్యం