31, జనవరి 2016, ఆదివారం

రామగిరి ఖిల్లా వైభవం రెండు మతాల సమ్మేళనం

      రామగిరి ఖిల్లా వైభవం రెండు మతాల సమ్మేళనం                      

         క్రీస్తు పూర్వం శాతవాహనుల కాలం నుండి 'రామగిరి' ఉనికిలో ఉన్నది10-11 శతాబ్దాల కాలంనుండి కళ్యాణిచాళక్యులు , కాకతీయరాజులు , బహమనీసుల్తానుల   కడకు   మొగలాయిల   ఏలుబడి లో  ఈ  అద్బుత మైన  ఈ  కోట చరిత్ర కెక్కింది . 

              తెలంగాణా రాష్ట్రం లో  పేరెన్నికగన్న ఈ కోట జిల్లా కేంద్రం కరీంనగర్ కు షుమారు  60 km దూరం లో కరీంనగర్ -పెద్దపల్లి -మంథని  రోడ్డుమార్గం లో ఉన్నది .  రైలు ప్రయాణ మైతే సికింద్రాబాద్ -నాగపూర్  రైలు మార్గంవిజయవాడ -నాగపూర్ రైలు మార్గాలలో గల పెద్దపల్లి  స్టేషన్ కు షుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది . కోటను చేరుకోవాలి అంటే పెద్దపల్లి -మంథని రోడ్ మార్గంలో nagepalli junction నుండి begumpeta  గ్రామానికి  ఎలావచ్చినా  అక్కడి నుండి కొంత దూరం  కాలినడక సాగించాల్సి ఉంటుంది .   
పరిసర దర్శనీయ ప్రదేశాలు   
  1. begampeta కు 16 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీరాన మంథని లో చరిత్ర కలిగిన గౌతెమేశ్వర దేవాలయం  కాక ఇంకా పెక్కు దేవాలయాలు ఉన్నాయి . 
  2. మంథని  దగ్గరలో గల చంద్రవెల్లి గుళ్ళు చూడదగినవి .