నా చిన్నతనం కొండవీడు అనే పేరు చాలాసార్లు విన్నాను కానీ అది ఎక్కడ ఉన్నదో తెలిసేది కాదు . ఈ మధ్యనే ఇంటర్నెట్ పుణ్యాన కొంత సమాచారం తెలిసింది కొండపల్లి, కొండవీడు ఈ రెండు గిరిదుర్గాలు చారిత్రాత్మకమైనవే.కొండపల్లికిల్లాగా ప్రసిద్ధమైనకొండపల్లి కోట కృష్ణా జిల్లా లో విజయవాడకు షుమారు 25 కిలోమీటర్ల దూరం లో హైదరాబాద్ వెళ్ళే రోడ్ మార్గం లో ఉంటే , కొండవీడు కోట national highway 16 కు దగ్గరగా గుంటూరు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో రాష్ట్రా రాజదానిగా develop ఔతున్న అమరావతి ప్రాంతానికి షుమారు 45 కిలోమీటర్ల దూరం లో గుంటూరు జిల్లాలోనె యడ్లపాడు మండలం కొండవీడు గ్రామం లో ఉన్నది. గుంతకల్ -గుంటూరు -విజయవాడ రైలు మార్గంలో ఫిరంగిపురం స్టేషన్ కు 4-5 కిలోమీటర్ల దూరం లోను ,విజయవాడ -చెన్నై మార్గంలో బాపట్ల కు షుమారు 60 కిలోమీటర్ల దూరంలోను ఉంది గుంటూరు జిల్లా లోని ఒక ప్రముఖ పట్టణం చిలకలూరి పేట కొండవీడు కు 30 km దూరం లో ఉంది
31, జనవరి 2016, ఆదివారం
ఉదయగిరి కోట పరిసర అడవులు వనమూలికలకు ఆలవాలం
ఉదయగిరి కోట -నెల్లూరు జిల్లా
పరిసర అడవులు వనమూలికలకు ఆలవాలం
పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా లొ మండల కేంద్రం ఉదయగిరి .జిల్లా లో ప్రముఖ పర్యాటక కేంద్రం ఉదయగిరి కోట విజయ నగర సామ్రాజ్యం లో బాగం అయ్యే నాటికే ఇది బలమైన గిరి దుర్గం . తరువాత మరింతగా అబివృద్ది చెందినది . కోట పరిసర కొండలన్నీ వనమూలికలకు ఔషద యుక్తమైన మొక్కలకు ప్రసిద్ది . అక్కడకొండల నుండి జాలువారే సెలయీటి నీరు కూడా ఆరోగ్య ప్రదమని అక్కడి ప్రజల నమ్మకం జిల్లా కేంద్రం నెల్లూరుకు 100 కిలోమీటర్ల దూరం లోను మరో పట్నం కావలి కి 80 కిలో మీటర్ల ఉంది . కానీ ఈ రెండు పట్నాల నుండి ఉదయగిరికి రైలు మార్గం లేదు . రోడ్ మార్గమే శరణ్యం
రామగిరి ఖిల్లా వైభవం రెండు మతాల సమ్మేళనం
రామగిరి ఖిల్లా వైభవం రెండు మతాల సమ్మేళనం
క్రీస్తు పూర్వం శాతవాహనుల కాలం నుండి 'రామగిరి' ఉనికిలో ఉన్నది. 10-11 శతాబ్దాల కాలంనుండి కళ్యాణిచాళక్యులు , కాకతీయరాజులు , బహమనీసుల్తానుల కడకు మొగలాయిల ఏలుబడి లో ఈ అద్బుత మైన ఈ కోట చరిత్ర కెక్కింది .
తెలంగాణా రాష్ట్రం లో పేరెన్నికగన్న ఈ కోట జిల్లా కేంద్రం కరీంనగర్ కు షుమారు 60 km దూరం లో కరీంనగర్ -పెద్దపల్లి -మంథని రోడ్డుమార్గం లో ఉన్నది . రైలు ప్రయాణ మైతే సికింద్రాబాద్ -నాగపూర్ రైలు మార్గం, విజయవాడ -నాగపూర్ రైలు మార్గాలలో గల పెద్దపల్లి స్టేషన్ కు షుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది . కోటను చేరుకోవాలి అంటే పెద్దపల్లి -మంథని రోడ్ మార్గంలో nagepalli junction నుండి begumpeta గ్రామానికి ఎలావచ్చినా అక్కడి నుండి కొంత దూరం కాలినడక సాగించాల్సి ఉంటుంది .
పరిసర దర్శనీయ ప్రదేశాలు
పరిసర దర్శనీయ ప్రదేశాలు
- begampeta కు 16 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీరాన మంథని లో చరిత్ర కలిగిన గౌతెమేశ్వర దేవాలయం కాక ఇంకా పెక్కు దేవాలయాలు ఉన్నాయి .
- మంథని దగ్గరలో గల చంద్రవెల్లి గుళ్ళు చూడదగినవి .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
