27, ఫిబ్రవరి 2017, సోమవారం

Devagiri Port

దేవగిరి 



               దేశంలో పురాతన చారిత్రక నేపద్యం ఉన్న కోటలలో దేవగిరి ఒకటి ఇది ముస్లిం పాలనా కాలం నుండి దౌలతాబాద్ గా వ్యహరించ బడుచున్నది . ఇది మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ జిల్లా లో ఉన్నది . ఇది ఔరంగాబాద్ నుండి 18 కిలోమీటర్ల దూరం లో ఎల్లోరా  గుహలకు వెళ్ళే మార్గం లో ఈ కోట శిధిలాలను  చూడవచ్చు  . 

24, ఏప్రిల్ 2016, ఆదివారం

Vally of flowers,Western himalayas,Uttarakhand

                         ఈ పుష్పాల లోయ  ఉత్తరాఖండ్ లో బదరీనాథ్ కు దగ్గరగా చమేలి జిల్లాలో షుమారు 80 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నది . ఈ లోయకు దగ్గరలో ఉన్న ప్రధాన పట్నం జోషిమఠ్ లేదా జ్యోతిర్ మఠ్. హరిద్వార్ ,ఋషికేశ్ ల నుండి బదరీనాథ్ వెళ్ళే మార్గం లో ఉన్నది . బదరీనాథ్ యాత్ర సాగుతున్న సమయంలో పలు బస్సు సర్వీసెస్  జ్యోతిమఠ్ మీదుగా ప్రయాణిస్తాయి . దగ్గరలో ఉన్న విమానాశ్రయం డెహ్రాడూన్ లో  ఉన్నది  

23, ఏప్రిల్ 2016, శనివారం

వారణాశి- పురాతన జ్యోతిర్లింగ లింగ క్షేత్రం

                                  


                                ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో గంగా నది పశ్చిమ తీరం లో ఉన్న భూభాగానికి ఉత్తర దక్షిణ దిశల్లో వరుణ , అశి  అనే చిన్న నదులు గంగా నదిలో కలుస్తూ ఉండటం చేత వారణాశి అని బెనారస్ ('వ' కారం 'బ' కారం గా మారి ) అని సంక్షిప్తం గా  కాశి  అని కూడా పిలుస్తారు ) ఇది  అతి  పురాతన జ్యోతిర్లింగ లింగ  క్షేత్రం  . ఈ క్షేత్రం లో  పరమేశ్వరుణ్ణి కాశి విశ్వేశ్వరుడు గాను లేదా కాశి విశ్వనాథుడు గాను, పార్వతి దేవిని విశాలాక్షి  గాను  కొలుస్తుంటారు . చరిత్రలో ఈ ఆలయం పలుమార్లు ముస్లిం దండ యాత్రల్లో నాశనమై , మరల పునఃనిర్మితమైనది . ఆ క్రమం లో 1780 సంవత్సరం లో ఇండోర్ పాలకురాలు  రాణి అహల్యాబాయి హోల్కర్ చేత పునఃరుద్దరణ కావించబడినది .  మీరా ఘాట్ లో విశాలాక్షి దేవాలయం అష్టా దశ శక్తి పితాల్లో ఒకటి , కాశి లో గల నవ గౌరీ లలో ఈ ఆలయం ఒకటి 

Mount Abu, Rajasthan

మౌంట్ అబూ, రాజస్తాన్ 


                                 మౌంట్ అబూ ఆరావళి పర్వతాలలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం . ఇది సముద్ర మట్టానికి ఎగువన ఉన్న ఎత్తైన పిత భూమి లో బాగం , గుజరాత్ రాష్ట్రానికి సరిహద్దు లో ఉన్నది (శిరోహి జిల్లా ). అబూ రోడ్ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ .భారత దేశం లో ఉన్న ప్రముఖ తాత్విక విజ్ఞాన సంస్థ  బ్రహ్మ కుమారి విశ్వ విద్యాలయం ప్రధాన కేంద్రం  ఇక్కడే ఉన్నది .