శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం -అరసవిల్లి ఆంధ్ర ప్రదేశ్ ,శ్రీకాకుళం జిల్లా లో అరసవిల్లి (Arasavalli ) గ్రామం లో గల సూర్య నారాయణ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ది చెందినది . ఒకప్పుడు విడిగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు జిల్లా కేంద్రం అయిన శ్రీకాకుళం పట్టణంలో కలసిపోయింది. దేవేంద్రుడు స్వయంగా సూర్యనారాయణస్వామిని ప్రతిష్టించాడని ఇక్కడి స్థల పురాణం . 7 వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ ఆలయం ముస్లిం పాలకుల దాడుల్లో నాశనమై మరల 18 శతాబ్దం లో పునఃనిర్మితమైనది. రధ సప్తమికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఇక్కడ మార్చి,అక్టోబర్( ఉత్తరాయణ ,దక్షిణాయన కాలాల్లో) నెలల్లో ప్రభాతవేళ సూర్యుని కిరణాలు ఆలయంలోని సూర్య నారాయణుని పాదాలపై పడటం ఇక్కడి ఆలయం ప్రత్యేకత .
శ్రీ కాకుళం 5 వ (New No.16)నెంబరు జాతీయ రహదారి పై ఉన్నప్పటికీ శ్రీ కాకుళంరోడ్ పేరుతొ ఉన్న రైల్వే స్టేషన్ మాత్రం ఇక్కడికి 16 కిలో మీటర్ల దూరం లో(చెన్నై -హౌరా రైల్వే మార్గం ) ఆముదాల వలస లో ఉన్నది . ఎయిర్ పోర్ట్ ఉన్న విశాఖపట్నం 120 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. శ్రీ కూర్మం ఇక్కడికి 12 కిలో మీటర్ల దూరం లో ఉన్న పుణ్య క్షేత్రం . ఇక్కడ మహా విష్టువు కూర్మావతారరూపంలో దర్సనమిస్తాడు.మరొక ప్రముఖ ఆలయం శ్రీముఖంలో ఉన్న శ్రీశ్రీవారాహిసమేత శ్రీముఖలింగేశ్వర ఆలయం 52 కిలోమీటర్ల దూరంలో ఉన్నది .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి