సోమనాథ్ ఆలయం,సౌరాష్ట్ర,గుజరాత్
జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొదటిది
శివపురాణం లో పేర్కొన జ్యోతిర్లింగాల మొదటిది సోమనాథ్ క్షేత్రం , దేశ వాయువ్య ప్రాంతం లో ఉండటం చేత పలుమార్లు విదేశియుల దండయాత్రల పాలై విద్వంసాలకు దోపిడీలకు నేలవైనది . అదేవిదంగా పునఃనిర్మితమైంది .దక్ష ప్రజాపతి ఇచ్చిన శాప విముకై చంద్రుడు స్నానమాచరించిన ప్రభాస తీర్థం ఇక్కడ ఉన్నది . ఇక్కడ లింగాన్ని చంద్రుడు ప్రతిష్టించటం చేత ఇక్కడ శివుడు సోమనాథుడు పేరుతొ పిలువబడుతున్నాడు .
గుజరాత్ రాష్ట్రం సౌరాష్ట్ర ప్రాంతం లో గిర్ సోమనాథ్ జిల్లా లో అరేబియా సముద్ర తీరంనికి చేరి ఉన్నది . అహ్మదాబాద్ నగరానికి షుమారు 400 కిలోమీటర్ల దూరం లో ఉన్నది .సౌరాష్ట్ర ప్రాంతానికి మూడు దిక్కులా సముద్రమున్నది. దేశమంతటి నుండి railway connectivity ఉన్న ఆహ్మాదాబాద్ జంక్షన్ నుండి ఇక్కడకు రైలు మార్గమున్నది . దగ్గరగా ఉన్న విమానాశ్రయం Keshod 52 కిలోమీటర్ల దూరం లో ఉంది .
శ్రీ కృష్ణుడు నిర్యాణము చెందిన భల్క తీర్థం సోమనాథ దేవాలయం కు దగ్గరలోనే ఉన్నది. హిరణ్య, కపిల్, సరస్వతి నదుల సంగమం అయిన ప్రదేశం లో త్రివేణిఘాట్ సముద్ర తీరానికి దగ్గరలోనే ఉన్నది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి