ద్వారక - బేట్ ద్వారక,గుజరాత్
దగ్గర లోనే జ్యోతిర్లింగ క్షేత్రం
ఆధ్యాత్మికం గా చార్ దామ్ పుణ్య క్షేత్రాలు గా 4 దర్శ నీయ ఆలయాల్లో ద్వారక ఒకటి . మిగిలిన మూడు బదరీనాథ్ , పూరి జగన్నాథ్ క్షేత్రం , తమిళనాడు లోని రామేశ్వరం .ఇక ద్వారక విషయానికి వస్తే ద్వారక -బేట్ ద్వారక అనే రెండు క్షేత్రాల ప్రస్తావన వస్తుంది . ఈ రెండు క్షేత్రాల దర్శనం పూర్తి కావిస్తే కాని ద్వారక యాత్ర పూర్తి అయినట్లు కాదు . ఈ రెండు ద్వారకల మద్య షుమారు 40 కిలోమీటర్ల ఎడం ఉంటుంది .
![]() |
| ద్వారక క్షేత్రం |
బేట్ ద్వారక క్షేత్రం
ద్వారక మీదుగా వచ్చే రైలు మార్గం ఓఖా తీరం లో ఆగిపోతుంది ఇక్కడనుండి 3-4 కిలోమీటర్లు మర పడవ /స్టీమర్ పై స్వంత జాగ్రత్తలతో సముద్ర ప్రయాణం చేయటం ద్వారా బెట్ ద్వారక దీవి కి చేరుకోవచ్చు .ఇది శ్రీ కృష్ణుడు తన చిన్ననాటి మిత్రుడు కుచేలుడు (సుదాముడు )ఇద్దరూ కలుసుకున్న ప్రదేశం.
![]() |
| రుక్మిణి దేవి ఆలయం |
ద్వారక -బెట్ ద్వారక లలో ఉన్న ఆలయాలు కాక 18 కిలోమీటర్ల దూరంలోసముద్ర తీరానికి దూరంగా దారుకావనం లో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 6 వది అయిన నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉన్నది, బేట్ ద్వారక మార్గానికి దూరంగా కుడివైపున 2 కిలో మీటర్ల దూరం లో రుక్మిణి దేవి ఆలయం ఉన్నది , సముద్ర తీరం వెంబడి 235 కిలో మీటర్ల దూరం లో మరొక జ్యోతిర్లింగా క్షేత్రం సోమనాథ్ ఉన్నది .
గుజరాత్ లో ప్రముఖ నగరమైన జామ్ నగర్ 135 కిలోమీటర్ల దూరంలో ఉన్నది . జునాగడ్ (200 KM ) సోమ నాథ్ జ్యోతిర్లింగం 235 కిలోమీటర్ల దూరం లో ఉన్నది . అహ్మదా బాద్ నుండి ద్వారక మీదుగా ఓఖా వరకు రైలు మార్గ మున్నది . ద్వారక కు దగ్గరలో ఉన్న విమానాశ్రయం జామ్ నగర్ లో ఉన్నది .



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి