ఆది శంకరా చార్యుల వారిచే ప్రవచింప బడిన అష్టా దశ శక్తి పీఠాల్లో అలంపురం లోని జోగుళాంబ అమ్మవారి ఆలయం 5వది . ఇది తెలంగాణా రాష్ట్రం లో జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ కు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్నపటికీ , 7 నెంబర్ జాతీయ రహదారికి (Hyderabad -Bangalore National High way ) 17కిలోమీటర్లదూరం లోను ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోనున్న కర్నూలు పట్టణానికి 25 కిలో మీటర్ల దూరంలోను ఉన్నది. ఈ ఆలయం 7శతాబ్దంలో బాదామి చాళుక్యులు లచేతనిర్మించబడి ,తరువాత కాకతీయులు ,విజయనగర పాలకులు చేత అబివృద్ది చేయ బడినది. ఇక్కడ జోగులాంబ అమ్మవారు రౌధ్ర స్వరూపిణి 9 బ్రహ్మేశ్వర ఆలయాలున్నాయి ఇవన్ని శివాలయాలే . వీటిలో బాలబ్రహ్మేశ్వర ఆలయం ప్రధానమైనది .ఈ ఆలయాలు తుంగభద్ర నదీ తీరం లోనే ఉన్నాయి . తుంగబధ్ర డాం నిర్మాణం వలన ముంపుకు గురి కావటం చేత మునిగి పోయిన సంఘమే శ్వర దేవాలయాన్ని అక్కడ నుంచి తరలించి అలంపురం లో పునః నిర్మించారు .
హైదరాబాద్ నగరానికి 215 కిలోమీటర్ల దూరం లో ఉన్నది . 7 నెంబరు జాతీయ రహదారి పై ఉండటం చేత హైదరాబాద్ , కర్నూలు నగరాల నుండి Bus /Taxi సౌకర్యాలున్నాయి . కాచి గూడ -గుత్తి రైలు మార్గం లో అలంపూర్ కు కర్నూలు రైల్వే స్టేషన్ 25 కిలోమీటర్ల దూరంలోను ,అలంపూర్ రోడ్ రైల్వే స్టేషన్ 9 కిలోమీటర్ల దూరం లోను ఉన్నాయి .
దగ్గరలో ఉన్న దర్శనీయ ప్రదేశాలు:-
రేణుక ఎల్లమ్మ దేవాలయం :- అలంపురం కు 52 కిలోమీటర్ల దూరం లో వడ్డమాను గ్రామం నందు కర్నూలు జిల్లా లో ఉన్నది


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి